అబ్బే తను మహర్షి కాదు

0

భరత్ అనే నేను గ్రాండ్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న మహర్షి విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలుపెడుతున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రిన్స్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నట్టు ఆ మధ్య బర్త్ డే సందర్భంగా వదిలిన టీజర్ లో క్లారిటీ రావడంతో కొత్త అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా నెట్ లో హల్చల్ చేస్తున్న ఒక ఫోటో చూసి మహర్షిలో ఇంకో షేడ్ లో కనిపించే కొత్త గెటప్ అనుకుని దాన్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

కారణం మహేష్ అందులో ఇంతకు ముందు పెంచిన గెడ్డం మీసం లేకపోవడం. కానీ ఇది వాస్తవానికి సినిమా స్టిల్ కాదు. కుటుంబంతో సరదాగా ఫ్యామిలీ ట్రిప్ లో జర్మనీలో ఎంజాయ్ చేస్తుండగా తీసినది. అంతే తప్ప సినిమాలో భాగంగా వచ్చేది కాదు. కాకపోతే అదే పనిగా క్లీన్ షేవ్ చేసాడు అంటే సినిమాకు కూడా కంటిన్యూ అయ్యేలా ఉండొచ్చనే అంచనా అయితే ఉంది.

అమెరికా షెడ్యూల్ కాస్త ఆలస్యం కావడంతో మహేష్ టైం ఇలా గడిపేస్తున్నాడు. ఏప్రిల్ 5 విడుదల ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న మహర్షి యుఎస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి షూటింగ్ వేగం అందుకుంటుంది. తిరిగి వచ్చాక గ్యాప్ లేకుండా కొనసాగించేందుకు ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఓ గ్రామానికి సంబంధించిన సెట్ ని సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు అయ్యాక హైదరాబాద్ లోనే బాలన్స్ ఫినిష్ చేస్తారు. అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్న మహర్షికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పాటల రికార్డింగ్ కూడా త్వరలోనే జరపనున్నారు.

ఫస్ట్ లుక్ టీజర్ కే బిజినెస్ ఎంక్వయిరీలు భారీగా వస్తున్న మహర్షి రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని సెన్సేషన్స్ తీసుకువచ్చేలా ఉంది. ఇటీవలే అరవింద సమేత వీర రాఘవతో సాలిడ్ హిట్ కొట్టిన పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ కావడం మరో ప్రధాన ఆకర్షణ.
Please Read Disclaimer