మహర్షికి ‘U’ వస్తుందనుకుంటే!!

0

సూపర్ స్టార్ మహేష్ కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ `మహర్షి` రిజల్ట్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ట్రేడ్ సహా అభిమానుల్లో.. ఆసక్తికర చర్చ ఇది. ఈ సమ్మర్ లో బెస్ట్ ట్రీట్ ఇస్తుందా? అంటూ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఈ సినిమా కోసం వంశీ పైడిపల్లి ఏకంగా తన జీవితంలో మూడేళ్లు అంకితమివ్వగా .. ఏడాది పాటు మహేష్ సహా చిత్రయూనిట్ కఠోరంగానే శ్రమించారు. ఆ శ్రమకు ఫలం అందుకునే రోజు దగ్గరలోనే ఉంది. మే 9న అన్నిటికీ సమాధానం దొరుకుతుంది.

తాజాగా `మహర్షి` సెన్సార్ రిపోర్ట్ అందింది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యుఏ సర్టిఫికెట్ ని జారీ చేసింది. సినిమాని వీక్షించిన సెన్సార్ బృందం చిత్రయూనిట్ ని ప్రశంసించిందని తెలుస్తోంది. అయితే మహర్షి టీజర్- ట్రైలర్ – పోస్టర్ .. ఏది పరిశీలించినా ఎక్కడా అసభ్యత అన్నదే లేకుండా క్లీన్ గా కనిపిస్తున్నాయ్. మరి సెన్సార్ బృందం `క్లీన్ యు` ఇవ్వకుండా.. `యు` తో పాటు `ఏ` ఎందుకు ఇచ్చిందో అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక మహేష్ కెరీర్ లోనే ది బెస్ట్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దిల్ రాజు బృందం సన్నాహకాల్లో ఉన్నారు. అలాగే ఏపీ- నైజాంలో స్పెషల్ షోల ఏర్పాటు కోసం చిత్రబృందం ప్రయత్నాల్లో ఉంది. ఏపీలోని సిటీల్లో తొలి వారం టిక్కెట్టు ధరను రూ.200గా ఫిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మీనాక్షి శేషాద్రి మరో ప్రధాన ఆకర్షణ. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ పాత్ర కాస్తంత సీరియస్ మోడ్ లోనే సాగుతుందని ఇటీవలే ట్రైలర్ వేడుకలో రివీల్ చేశారు. దేవీశ్రీ పాటలకు మిశ్రమ స్పందనలు వచ్చిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer