#మహర్షి: కుదిరిన హిందీ రైట్స్ డీల్

0

ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ మీద ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘మహర్షి’ ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. అశ్విని దత్.. ప్రసాద్ వీ. పొట్లూరి ఇద్దరూ కూడా నిర్మాతలే గానీ ప్రాజెక్ట్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయింది దిల్ రాజు అన్నది అందరికీ తెలిసిందే. ఇక ‘మహర్షి’ సినిమాకు హిందీ రైట్స్ డీల్ గురించి చాలా వార్తలు వచ్చాయి.

‘మహర్షి’ సినిమా టీజర్ రిలీజ్ చేయక ముందునుండే రాజుగారు ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలుపెట్టాడట. హిందీ డబ్బింగ్ రైట్స్ కు రూ. 25 కోట్లు కోట్ చేశాడట. రాజు గారి లెక్క ఏంటంటే ‘రంగస్థలం’ సినిమా హిందీ రైట్స్ డీల్ రూ. 22 కోట్ల క్లోజ్ అయింది కాబట్టి ‘మహర్షి’ కి మరో మూడు కోట్లు అదనంగా కలిపి పాతిక కోట్లు చెప్పాడట. కానీ ఆ రేట్ కు కొనేందుకు ముందుకు రాకపోవడంతో అప్పట్లో డీల్ క్లోజ్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం ‘మహర్షి’ హిందీ డీల్ రూ. 20 కోట్లకు క్లోజ్ చేశారట రాజుగారు. హిందీ వెర్షన్ డబ్బింగ్ రైట్స్.. శాటిలైట్ రైట్స్..డిజిటల్ రైట్స్ అన్నీటికీ కలిపి ఈ రేటు.

హిందీ డబ్బింగ్ రైట్స్ విషయానికి వస్తే యాక్షన్ ఫిలిమ్స్ కు ఆదరణ ఎక్కువ. కానీ ‘అరవింద సమేత’ హిందీ రైట్స్ రూ. 18 కోట్లకు మాత్రమే తీసుకురావడంతో దిల్ రాజు కూడా ‘మహర్షి’ విషయంలో రూ. 20 కోట్లకే సరిపెట్టుకున్నాడట. హిందీ రైట్స్ ఎక్కువరేటు పలికేందుకు మరో రెండు ఫైట్స్ యాడ్ చేయాలని రాజుగారు వంశీ పైడిపల్లి పై ఒత్తిడి తీసుకొచ్చారని.. కానీ మహేష్ అందుకు ఒప్పుకోక పోవడంతో ఆ ప్రపోజల్ ను పక్కనబెట్టారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు డీల్ క్లోజ్ అయింది కాబట్టి వాటితో పనేలేదు.
Please Read Disclaimer