మహేష్ ఫ్యాన్స్ కు టెన్షన్ తెప్పించే రూమర్!

0

సంక్రాంతి సీజన్ సినిమాల విడుదల హంగామా దాదాపుగా చివరికి వచ్చేసింది. మరి కొద్ది గంటల్లో చివరి సినిమా ఫలితం కూడా తేలిపోతుంది. సినిమాలు ఎన్నైనా ఉండొచ్చుగానీ బోయపాటి శ్రీను – రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్. అసలు చరణ్ తో బోయపాటి చేయించిన చిత్ర విచిత్ర విన్యాసాలను ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకొనేందుకు సమయం పట్టేలా ఉంది.

ఇంతలో ఫిలిం నగర్లో కొత్తగా వినిపిస్తున్న వార్తలు మహేష్ బాబు ఫ్యాన్స్ కు టెన్షన్ తెప్పించేలా ఉన్నాయి. కారణం ఏంటంటే బోయపాటి- మహేష్ కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యేలా ఉందట. మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడు. మరోవైపు బోయపాటి శ్రీను బాలయ్య సినిమాకు సిద్ధం అవుతున్నాడు. అటు మహేష్-సుకుమార్ సినిమా.. ఇటు బోయపాటి – బాలయ్య సినిమా పూర్తయిన తర్వాత బోయపాటి – మహేష్ సినిమా ఉంటుందని ఈ వార్తల సారాంశం.

ఇప్పుడు ‘వినయ విధేయ రామ’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూసిన తర్వాత కూడా బోయపాటికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ బోయపాటి దర్శకత్వానికి ఒకే చెప్తే ఘ..ట్ట..మ..నే..ని డైలాగ్ కు రెడీ అయిపోవాల్సిందే.
Please Read Disclaimer