మళ్ళీ లుక్స్ తో చంపేసిన మహేష్

0సూపర్ స్టార్ మహేష్ బాబు మామూలుగానే హ్యాండ్ సమ్ లుక్స్ లో ఉంటాడు. ఇక అయన ఫోటో షూట్ ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యంలో జరిగితే.. అది కూడా బ్లాక్ అండ్ వైట్ లో అయితే ఎలా ఉంటుంది? చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు.

సరిగ్గా అలాగే జరిగింది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ రీసెంట్ గా మహేష్ బాబు తో ఫోటో షూట్ చేయడం జరిగింది. ఆ మోనోక్రోమ్ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటూ “పోస్ట్ ప్యాక్ అప్ షూట్ విత్ ద సూపర్ ఛార్మింగ్ సూపర్ ఫాస్ట్ సూపర్ స్టార్.. మహేష్ బాబు’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఫోటో ఎలా ఉంది అంటే ‘మహర్షి’ బియర్డ్ లుక్ కావడంతో బ్లాక్ అండ్ వైట్ ఫొటో కొత్తగా ఉంది. ఇక ఫోటోలో హైలైట్ ఏంటి అంటే మహేష్ కళ్ళలో కనిపించిన మెరుపు. సహజంగా ఎవరైనా ఆనందంగా కనిపించినప్పుడు కళ్ళలో మెరుపు కనిపించిందని అంటుంటారు. ఇక అవినాష్ గోవారికర్ మాత్రం మహేష్ కళ్ళలో మెరుపు అందరికీ కనిపించేలా ఫోటో తీయడం విశేషం.

ఇక సేమ్ ఫోటోను మహేష్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. మీ స్టైల్ ఆఫ్ వర్క్ నచ్చిందని మీతో వర్క్ చేయడం ఎప్పుడూ సూపర్ ఫన్ అని మీ సూపర్ స్పెషల్ మహారాష్ట్రియన్ లంచ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేశానని చెప్పాడు.

ఇక ఫోటోకు వచ్చిన లైకుల సంగతి చెప్పనవసరం లేదు కదా?