బులుగు సముద్రం తొంగి చూసేలా..!

0

సందు దొరికితే చాలు థాయ్ ల్యాండ్ – లండన్ – ఇటలీ – యూరప్ అంటూ అదిరిపోయే ఎగ్జోటిక్ లొకేషన్లకు ప్లాన్ చేస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్. ఒక ఫ్యామిలీ మ్యాన్ గా అతడి ప్లానింగే వేరు. కెరీర్ ఒత్తిడులు ఎప్పుడూ కుటుంబ జీవనానికి అడ్డంకి కానేకాదని నిరూపించిన గ్రేట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నాడు సూపర్స్టార్ కృష్ణ రోజుకు మూడు కాల్షీట్లు పనిచేసి ఎంతగా శ్రమించినా ఫ్యామిలీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. తండ్రి నేర్పించిన క్రమశిక్షణ – కుటుంబ పాలనను ప్రిన్స్ అనుసరిస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రతిదీ పక్కాగా డిజైన్ చేస్తూ నలుగురికీ ఆదర్శం గా నిలుస్తున్నాడు.

భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ విజయం సాధించడం మహేష్ కి పూర్తి రిలీఫ్ ని ఇచ్చింది. స్పైడర్ తెచ్చిన టెన్షన్ నుంచి మహేష్ ని బయటికి తెచ్చింది ఆ సక్సెస్. ఆ క్రమంలోనే వరుసగా అన్ని టెన్షన్ల నుంచి రిలీఫ్ కోసం విదేశీ షికార్లు ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా ఇప్పటికే పలుమార్లు నమ్రత – సితార – గౌతమ్ లతో కలిసి ఎగ్జోటిక్ లొకేషన్లకు వెళ్లిన మహేష్ .. ఇటీవలే మహర్షి షూట్ గ్యాప్ లో మరో థ్రిల్లింగ్ ట్రిప్ ని ప్లాన్ చేశాడు. వారం పదిరోజుల పాటు గ్యాప్ దొరికితే చాలు ఫుల్ చిలౌట్ ని ప్లాన్ చేసేస్తూ మహేష్ తన లైఫ్ స్టైల్ ని గుర్తు చేస్తున్నాడిలా.

ఈసారి స్పాట్ థాయ్ ల్యాండ్ లోని – సాము అనే దీవికి పెట్టాడు. అక్కడి నుంచి లైవ్ ఫోటో ఒకటి నమ్రత ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేయడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలో మహేష్ జస్ట్ 20 మైనస్ అన్న తీరుగా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఫీల్డులోంచి బయటకు వస్తే తాను ఎలా చిలౌట్ మూడ్ లో ఉంటాడో ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. అల్లంత దూరాన డీప్-బ్లూ సీ.. దానికి ఎగువన బులుగు జిలుగు స్విమ్మింగ్ పూల్. ఆ గట్టున మహేష్ .. ఆ లుక్కే సంథింగ్. అసలు ఆ లొకేషన్ చూస్తుంటేనే గుండెల్లో జిల్ జిల్ మంటోంది. ఫోటోకే ఇంత ఇంపాక్ట్ ఉంటే ఈ స్విమ్మింగ్ పూల్ గట్టున నుంచుని ఫోటో దిగిన మహేష్కి ఇంకెంత ఇదిగో ఉందో. ఇక మహర్షి షూటింగ్ అప్ డేట్ లోకి వెళితే అక్టోబర్ 15 నుండి అమెరికాలో తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇప్పటికే రెండు పాటలు చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా మహర్షి విడుదల కానుంది.
Please Read Disclaimer