కేసులున్నా మహేష్ షూటింగ్ ఆగలే!!

0మహేష్ బాబు కొత్త సినిమా విషయంలో వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పీవీపీతో చేయాల్సిన వంశీ పైడిపల్లి సినిమాకి.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించడం వివాదానికి దారి తీసింది. దీనిపై కోర్టు మెట్లు ఎక్కిన పీవీపీ.. స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఈ విషయంలో సెటిల్మెంట్ కు ప్రయత్నించినా.. అవేమీ వర్కవుట్ కాలేదని తేలిపోయింది.

అయితే.. ఇప్పటికే అనుకున్న షెడ్యూల్ కంటే 2 వారాలు ఆలస్యం కావడంతో.. డెహ్రాడూన్ లో షూటింగ్ ప్రారంభించేయాలని నిర్ణయించారు మహేష్ అండ్ టీం. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం అనే పాయింట్ ను కూడా పీవీపీ తరపు లాయర్ రెయిజ్ చేశారు. దీంతో మహేష్25 షూటింగ్ అపేస్తారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఈ కేసులు.. వివాదాలు.. కోర్టు ఆర్డర్లు లాంటివేమీ దర్శక నిర్మాతలతో పాటు హీరో కూడా పట్టించుకునేటట్లు కనిపించడం లేదు. డెహ్రాడూన్ లో షూటింగ్ నిరాటంకంగా సాగిపోతోందని.. షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన పిక్స్ సూచిస్తున్నాయి.

మహేష్ బాబు- పూజా హెగ్డేల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ సాగుతోందట. ఈ మూవీ నిర్మాణంలో మైనర్ భాగస్వామిగా పీవీపీని చేర్చాలనే ప్రతిపాదనకు దిల్ రాజు అంగీకరించకపోవడం.. వివాదాన్ని మరింతగా పెంచేసిందని అంటున్నారు. మరోవైపు అశ్వినీదత్ షేర్ ను పెంచేందుకే అంగీకరించని దిల్ రాజు.. పీవీపీకి పార్ట్ నర్ షిప్ ఇచ్చే ప్రసక్తే లేదని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.