బావంటే మహేష్ కి ఎంత ప్రేమ

0బావ – బావమరుదుల మధ్య కెమిస్ట్రీ చాలా బావుంది! బావ సుధీర్ నటించే సినిమాలకు మహేష్ ప్రమోషన్ అదిరిపోతోంది. అయితే ఘట్టమనేని హీరోల అండా దండా ఉన్నా సుధీర్ బాబు మాత్రం స్వయంకృషితో ఎదిగేందుకు తెలివైన ప్లాన్స్ వేస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎల్లకాలం ఒకరి అండ ఉండదు. ఇక్కడ ఎవరి దుకాణం వారిదే కాబట్టి – అందుకు తగ్గట్టే ఆలోచించాలి. అలా ఆలోచించిన తర్వాత సుధీర్ సొంతంగా బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్నాడు. పరిమిత బడ్జెట్ తో నవతరం దర్శకుల్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేశాడు.

అలా తన సొంత బ్యానర్ ఎస్ బి (సుధీర్ బాబు) ప్రొడక్షన్స్ లో వస్తున్న తొలి సినిమా `నన్ను దోచుకుందువటే`. సుధీర్ బాబు హీరోగా నటించాడు. “అక్కడ యూఎస్ లో ట్రంపు – ఇక్కడ కార్తీక్“ అంటూ ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. దీనికి మహేష్ బావ నుంచి తాజాగా రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్ లో ఈ ట్రైలర్ ని ట్వీట్ చేసిన మహేష్ దానికి అద్భుతమైన కొటేషన్ ఇచ్చారు.

“నిర్మాతగా సుధీర్ తొలి ప్రయత్నానికి బెస్ట్ విషెస్.. ట్రైలర్ చాలా ప్రామిస్సింగ్ గా ఉంది. ఆల్ ది బెస్ట్“ అని తెలిపాడు. సెప్టెంబర్ 21న థియేటర్లకు వెళ్లమని మహేష్ హింటిచ్చాడు. అంత పెద్ద స్టార్ తనంతట తానుగానే ఆ ట్రైలర్ చూసి స్పందించారు. ఎంకరేజ్ చేశారు. ఇది సుధీర్ ప్రొడక్షన్ హౌస్కి చాలా పెద్ద బూస్ట్. మహేష్ అభిమానులంతా ఈ ట్రైలర్ వీక్షించి సుధీర్ సినిమా చూస్తే చాలు పెద్ద హిట్టు కొట్టినట్టే. ఇకపోతే మహేష్ ఇదివరకూ కేరాఫ్ కంచరపాలెం లాంటి చిన్న సినిమాని గొప్పగా ప్రమోట్ చేశారు. ఆ సినిమా సాయానికొచ్చిన రానాని మహేష్ ట్విట్టర్ లో పొగిడేశారు. ఇక ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన `నన్ను దోచుకుందువటే` సినిమాకి ప్రమోషన్ బావుంది. ఇందులో నాజర్ – పృథ్వీ లాంటి సీనియర్ నటులు కనిపించడం అస్సెట్. ఇంత బ్యాకప్ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.