ఈద్ ముబారక్ అంటున్న మహేష్

0Mahesh-Babu-Ramzan-Wishesఒక ప్రక్కన తన సినిమా రిలీజ్ డేట్ చెప్పాడు కాని.. ఇంతవరకు ప్రత్యేకంగా ఆ సినిమా గురించిన ప్రమోషన్లు మొదలవ్వలేదు. అయితే ‘స్పైడర్’ సినిమా గురించి మహేష్ ఏమన్నా చెబుతాడేమో అనుకుంటే మాత్రం.. ఇప్పుడు.. మనోడు ఇతర సుర్ప్రైజులతో సరిపెట్టేస్తున్నాడు. అదిగో హ్యాపీ రంజాన్ అంటూ ఇప్పుడు అలాంటి ట్రీట్ ఒకటి ఇచ్చాడు.

ఈసారి ప్రత్యేకంగా సంప్రదాయ ముస్లిం తరహాలో కనిపించే కుర్తా వేసుకుని.. దానిపై ఒక జెరీ కోటు వేసుకుని.. ఒక ఫోటోషూట్ తో దూసుకొచ్చాడు మహేష్. ఈ షూట్ ఏదన్నా యాడ్ కు సంబంధించినదా లేదంటే సరదాగా రంజాన్ కోసం చేయించాడా తెలియదు కాని.. ఈ కొత్త షూట్లో మహేష్ బాబు కొత్తగా కనిపిస్తున్నాడు. హ్యాపీ రంజాన్.. ఈద్ ముబారక్.. అంటూ తన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ముస్లిం సోదరులను అలరించాడు సూపర్ స్టార్. అదే విధంగా కొత్త లుక్ లో కనిపించి తన అభిమానులను కూడా ఉత్తేజపరిచాడు.

ఇకపోతే సెప్టెంబర్ 21న స్పైడర్ సినిమా రిలీజవ్వనుండగా.. ఇప్పుడు మహేష్ తన తదుపరి సినిమా అయిన భరత్ అను నేను షూటింగులో బిజీగా ఉన్నాడు. హైదరాబాదులో వేసిన ఒక ప్రత్యేక అసెంబ్లీ సెట్లో డైరక్టర్ కొరటాల శివ ఇప్పుడు మహేస్ అండ్ ఇతర తారాగణంపై కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్నారు. అది సంగతి.