`సీమ` ఎంబీఏ స్టూడెంట్ గా ప్రిన్స్?

0కొరటాల శివ ప్రిన్స్ మహేష్ బాబుల కాంబోలో వచ్చిన `భరత్ అనే నేను` మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను తెచ్చిపెట్టింది. దీంతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న మహేష్ 25వ చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తన 25 వ సినిమాలో డిఫరెంట్ లుక్ లో మహేష్ కనిపించబోతున్నాడని టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ మీసకట్టుతో…లైట్ గా గడ్డంతో కనిపిస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే గడ్డంతో ఉన్న మహేష్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఆ సినిమాలో మహేష్ పాత్ర ఎలా ఉండబోతోందన్న దానిపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఆ చిత్రంలో మహేష్….ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడని తాజాగా టాక్ వినిపిస్తోంది.

మహేష్ 25వ సినిమాకు సంబంధించిన పనులు చకచకా సాగిపోతున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డెహ్రా డూన్ లో ప్రారంభంకానుంది. ఈ సినిమాలో లైట్ గడ్డంతో ఉన్న మహేష్ ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించనున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రిన్స్ రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడబోతున్నాడట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో ఈ కథ ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సినిమా కు సంబంధించి న్యూయార్క్ లో ఎక్కువగా చిత్రీకరణ ఉండబోతోందని కొన్ని కీలకమైన సన్నివేశాలు కర్నూలులో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దిల్రాజు అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. మహేష్ లుక్ పై మరింత క్లారిటీ రావాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.