మ‌హేష్ బాబు శివంకు చెల్లు చీటి

0mahesh-babu-as-sivamమ‌హేష్ బాబు – క్రిష్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపు దిద్దుకోనుంద‌ని గ‌త కొంత‌కాలంగా ప్రచారం జ‌రుగుతోంది. పేరు శివం… అన్నారు. ఈ చిత్రానికి అశ్వనీద‌త్ నిర్మాత అని చెప్పుకొన్నారు. బాలీవుడ్ భామ‌ని క‌థానాయిగా ఎంచుకొన్నారు. అయితే… ఈ ప్రాజెక్ట్ ఎంత‌కీ ముందుకు క‌ద‌ల్లేదు. ఇప్పుడు ఈ సినిమా కి చెల్లు చీటీ ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది.

మ‌హేష్ కి శివం క‌థ న‌చ్చలేదని స‌మ‌చారం. మ‌హేష్‌తో సినిమా వ‌ర్కవుట్ కాద‌ని.. క్రిష్ కూడా బాలీవుడ్ సినిమాతో బిజీగా అయిపోయాడు. ఇప్పుడు శివం స్థానంలో మ‌రో సినిమా మొద‌లు పెట్టడానికి అశ్వనీద‌త్ రంగం సిద్ధం చేసుకొన్నారు. రాజ్ నిడిమోరు, కృష్ణ డికెల‌ను రంగంలోకి తీసుకొచ్చారు. ఈ ద‌ర్శక ద్వయం ఇప్పుడు మ‌హేష్ కోసం క‌థ రెడీ చేసుకొనే ప‌నిలో ప‌డింది. 2014లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.