మహేష్ స్లీపింగ్.. సితార యాక్టింగ్

0

కొంతమందిని చూస్తే తిట్టబుద్దౌతుంది కొత్తమందిని చూస్తే మొట్టబుద్ధౌతుంది అని జెనరల్ గా అంటుంటారు… కానీ ఈ రెండు కాకుండా సితార పాపను చూస్తే మాత్రం ఎవరికైనా ముచ్చటేస్తుంది…ముద్దొస్తుంది. ఎంతైనా అప్పటి సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు.. ఇప్పటి సూపర్ మహేష్ బాబు గారాలపట్టి కదా.

మహేష్ వైఫ్ నమ్రత అప్పుడప్పుడూ సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు – సితార పాప ఇద్దరూ ఉండే ఫోటోలను అభిమానులకోసం షేర్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి వీడియోలు కూడా షేర్ చేస్తుంది. ఇక అవి లైకులతో షేర్ లతో సోషల్ మీడియా దుమ్ము దులుపుతాయి. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే మహేష్ కు యాంటి ఫ్యాన్స్ ఉంటారు కదా.. వాళ్ళు కూడా సితార పాప అల్లరిచూస్తే ఫ్లాట్ ఆవుతారు.

తాజాగా అలాటిదే జరిగింది. నమ్రత పోస్ట్ చేసిన ఫోటోలో మహేష్ అలిసిపోయి డీప్ స్లీప్ లో ఉన్నాడు. ఇక పక్కనే అల్లరిపాప నాన్నను ఇమిటేట్ చేస్తూ గాఢ నిద్రలో ఉన్నట్టు నటిస్తోంది. ఫోటోను గమనించకుండా సడెన్ గా చూస్తే నాన్న పక్కన పడుకుని నిద్రపోతోంది కదా అనుకుంటారు. కానీ పరిశీలించి చూస్తే కుడిచేతి మధ్యవేలు.. ఉంగరం వేలు మడిచి ఆ గ్యాప్ లోనుంచి ఒక కన్ను తెరిచి అంతా గమనిస్తోంది. మరి సితార పాప ఎంత అల్లరి చేసినా అమ్మ నమ్రత కు తెలియకుండా ఉంటుందా. వెంటనే క్లిక్ మనిపించింది. సూపర్ ఫోటో కదా…?
Please Read Disclaimer