ఇక ట్రెండ్ మారుతుందన్న మహేష్

0”ఇక ప్రతి ఫంక్షన్‌ ట్రెండ్‌ మారుతుంది. అందరు హీరోలు ఒకరి ఫంక్షన్‌కి మరొకరు వెళ్తారు. మేము-మేమూ బాగానే ఉంటాం. మీరే బాగుండాలి’ అని అన్నారు మహేష్‌బాబు. మహేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భరత్‌ అనే నేను’. కైరా అడ్వాణీ కథానాయిక. కొరటాల శివ దర్శకుడు.

ఎల్బీ స్టేడియంలో ‘భరత్‌ అనే నేను’ ప్రీరిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కథానాయకుడు మహేష్‌బాబు మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రీరిలీజ్‌ వేడుకలా లేదు. సినిమా 100 రోజుల ఫంక్షన్‌లా ఉంది. ఈ వేడుకకు వచ్చిన తారక్‌కు ధన్యవాదాలు. ‘ఆది’ 100రోజుల ఫంక్షన్‌కు నేను వెళ్లా. మళ్లీ ఇప్పుడు ఈ ప్రీరిలీజ్‌ వేడుకకు తారక్‌ వచ్చాడు. మన చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలంటే ఐదారుగురే. ఏడాదికి ఒక్క సినిమానే చేస్తాం. అందరి సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది. మేము అందరం బాగానే ఉంటాం. మీ బాగుండాలి” అని చెప్పుకొచ్చారు.