సీఈఓ గా మారిన సూపర్ స్టార్

0

ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుందట. కానీ అవేంటో కనుక్కోవలసిన బాధ్యత మాత్రం శ్రీ నరేంద్ర మోది భుజాల మీదనో మిస్టర్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మీదనో ఉండదు. అది మనమీదనే ఉంటుంది. మరి అదెలా కనుక్కోగలం అంటే.. ఎవరి ఛావు వారిది… ఎవరికి వారే కిందమీద పడి ఎలానో కనుక్కోవాలి. అదే మన లైఫ్ పర్పస్.. గోల్.. ఎయిమ్ అన్నీ.

ఈ క్లిష్టమైన టాపిక్ పక్కన బెడితే మనకు మహేష్ బాబు టాలెంట్ ఏంటి చెప్పండి? జస్ట్ అలా లుక్స్ తో అందరి ప్రాణం తోడేయడం. ముఖ్యంగా అమ్మాయిలకు నిద్రలేకుండా చేయడం. అది అయన గోల్. అయన పెట్టుకున్నాడో లేదో మనకు తెలీదు గానీ ఇలాంటి ఫోటోలు రిలీజ్ అయితే మరి అమ్మాయిలకు ఎలా నిద్రపడుతుంది? ఈ తాజా స్టిల్ మహేష్ ప్రస్తుతం నటిస్తున్న ‘మహర్షి’ సినిమాలోనిది. ఆ సూటు బూటులో జేమ్స్ బాండ్ లాగా ఉన్నాడు కదా.. క్లీన్ షేవ్ లుక్ లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని అమెరికన్ బిజినెస్ మ్యాన్ లాగా తయారయ్యాడు. ఇక ఆ స్టైలిష్ నడకతో సూపర్ హ్యాండ్సమ్ సీఈఓ గా మారిపోయాడు.

పొరపాటున హాలీవుడ్ హీరోయిన్లు కనుక మహేష్ ను చూస్తే ఆయనను హైదరాబాద్ కు ఇక తిరిగిరానివ్వరేమో. ఈ గెటప్ చూస్తుంటే మహేష్ ను డామినేట్ చేసేందుకు పూజా హెగ్డే చాలా కసరత్తులే చేయాల్సి వస్తుందని అనిపించడం లేదూ. ఏంటో.. ఈ మహేష్ ఎప్పుడూ అందం అంతా తన దగ్గరే పెట్టుకుని తిరుగుతుంటాడు.. వేరే హీరోలకు కొంచెం కూడా ఇవ్వొచ్చుగా..!
Please Read Disclaimer