మహేష్ కొత్త యాడ్ సూపర్ గా ఉందే

0

‘మహర్షి’ సినిమా రిలీజ్ కు జస్ట్ వారం రోజులు కూడా లేదు కాబట్టి ఈ సమయంలో మహేష్ బాబు పేరెత్తితే చాలు.. ఎవరైనా ‘మహర్షి’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ అనే అనుకుంటారు. కానీ మహేష్ అంటే జస్ట్ సినిమాలే కాదు.. టాప్ కార్పోరేట్ బ్రాండ్స్ కు అంబాజిడర్ గా కూడా వ్యవహరిస్తాడనే విషయం తెలిసిందే. అలా మహేష్ లిస్టులో ఉన్న యాడ్స్ లో థమ్సప్ ఒకటి.

మహేష్ నటించే మిగతా యాడ్స్ ఎలా ఉంటాయో ఏమో గానీ ఈ కూల్ డ్రింక్ యాడ్స్ మాత్రం ఒక సినిమా లోని యాక్షన్ సీక్వెన్స్ రేంజ్ లో ఉంటాయి. సడెన్ గా చూస్తే మహేష్ కొత్త సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ ఏమో అని అనుకునే అవకాశం ఉంది. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ మహేష్ తో హై ఆక్టేన్ యాడ్ ను రూపొందించారు. హెలికాప్టర్ క్రాష్ అయిన ప్రదేశంలో మహేష్..మరో బ్యూటీ ఇద్దరూ కలిసి కూల్ డ్రింక్ తాగడం.. ఆ తర్వాతహెలికాప్టర్ శిథిలాలనుండే ఇంజిన్ స్టార్ట్ చేసి కొండపై నుండి దూకడం.. ప్యారాచూట్ తో ల్యాండ్ కావడం.. తమ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేయడం లాంటి సీన్స్ సూపర్ గా ఉన్నాయి. ఇక ఇలాంటి సీన్స్ చూస్తుంటే మహేష్ ను ఎందుకు సూపర్ స్టార్ అంటారో మనకు మరోసారి అర్థం అవుతుంది. ఎంతో సహజంగా.. నిజంగా అలా జరిగింది కదా అనిపించేలా మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది.

ఈ యాడ్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వరా షేర్ చేసిన మహేష్ “#నా కొత్త థమ్సప్ అఫిషియల్ మిషన్. వర్క్ లో ఉన్న నన్ను చూడండి. ఈ అద్భుతమైన యాడ్ ను మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఎగ్జైటెడ్ గా ఉన్నాను.” అంటూ ట్వీట్ చేశాడు. ఈ యాడ్ కు సోషల్ మీడియాలో రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. కొందరు ఫ్యాన్స్.. “మీ థమ్సప్ యాడ్ కోసం మేము ఎదురు చూస్తుంటాం అంటే అది రేంజ్ లో ఉంటుందో తెలుసుకోవచ్చు” అని కామెంట్ చేశారు.
Please Read Disclaimer