మహర్షి టీమ్ కి గోవాలో మహేష్ స్పెషల్ ట్రీట్

0ఈ రోజు సూపర్ స్టర్ మహేష్ బాబు బర్త్ డే.. ఆల్రెడీ ఆడియన్స్ కు ఫస్ట్ లుక్ – టీజర్ల తో బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు.. ఫ్యాన్స్ అయితే ఫుల్ పండగ చేసుకుంటున్నారు. నిన్న రాత్రి తన క్లోజ్ ఫ్రెండ్స్ – ఫ్యామిలీ మెంబర్స్ కి తన ఇంట్లోనే పార్టీ ఇచ్చాడట. ఇప్పుడు ‘మహర్షి’ టీమ్ కి సాయంత్రం గోవాలో ఓ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడట. ఈ రోజు ‘మహర్షి’ టీమ్ అంతా గోవా కు వెళ్తుందని సమాచారం.

పార్టీ లో ‘మహర్షి’ నిర్మాతలైన దిల్ రాజు – అశ్విని దత్ – ప్రసాద్ వీ పొట్లూరి కూడా పాల్గొంటారట. ఇక ఈ రోజే రిషి తన ప్రయాణం మొదలైంది అని ఫస్ట్ లుక్ టీజర్లలో చెప్పారు.. అంతలోనే గోవా ఫ్లైట్ ఎక్కాడంటే అది మామూలు విషయం కాదు. మరి అక్కడ ‘మహర్షి’ టీమ్ చేసే హంగామా మనకు రేపటికల్లా ఫోటోల రూపంలో బయటకు వస్తాయి. ఈ రోజు బర్త్ డే సెలబ్రేషన్స్ తో ఫుల్ బిజీ.. రేపు మాత్రం ‘మహర్షి’ తాజా షెడ్యూల్ ను గోవా లో ప్రారంభిస్తారట. ఆ షెడ్యూల్ ఆగష్టు 14 వరకూ ఉంటుందని సమాచారం.

మరో వైపు సోషల్ మీడియా లో మహేష్ బర్త్ డే హంగామా జోరుగా ఉంది. ఫ్యాన్స్ తో పాటు ఇతర సెలబ్రిటీలు మహేష్ ను బర్త్ డే విషెస్ తో ముంచెత్తుతున్నారు. తన ల్యాండ్ మార్క్ ఫిలిం అయిన మహేష్ 25 వ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ లో సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉన్నాయి.