వెంకీ – రౌడీ – పవన్.. మహేష్ వాడేస్తున్నాడు..

0

టాలీవుడ్ లో అగ్రహీరోలు పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు.. ఇద్దరూ ఎవరికి వారే సాటి.. ఇద్దరూ కష్టపడి స్టార్ లుగా ఎదిగిన వారే. పవన్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడ్డారు. పవన్ మళ్లీ సినిమాలు ఎప్పుడు తీస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే అగ్రహీరోలైనప్పటికీ మహేష్ – పవన్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. త్రివిక్రమ్ తీసిన జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చింది మహేష్ బాబే.. త్రివిక్రమ్ వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి కారణమయ్యారు. గతంలో మహేష్ తో అతడు – ఖలేజా తీసిన త్రివిక్రమ్ కు పవన్ క్లోజ్ ఫ్రెండ్. అలా ఇద్దరు హీరోల మధ్య ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది.

అయితే తాజాగా మహేష్ బాబు తన కొత్త చిత్రం ‘మహర్షి’తో ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. మే 9న రిలీజ్ అయ్యే ఈ మూవీ ప్రి రిలీజ్ వేడుకను ఈరోజు సాయంత్రం నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాట్లు చేశారు. ఈ ఫంక్షన్ కు వెంకటేశ్ – రౌడీ విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు. దీంతో వారి ఫ్యాన్స్ కూడా మహేష్ కు ఈసారి సపోర్ట్ చేయనున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా మహేష్ వెంట నడవనున్నారు. ఈ ప్రిరీలీజ్ వేడుక సందర్భంగా ‘మహర్షి’ చిత్రం యూనిట్ విడుదల చేసిన పోస్టర్ పవన్ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. మహేష్ పోస్టర్ చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు – జనసేన పార్టీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు ఈ తాజా పోస్టర్ లో గాజు గ్లాసుతో టీ తాగుతూ కనిపించారు. ఈ గాజు గ్లాస్ జనసేన ఎన్నికల గుర్తు. ఇలా మహేష్ తమ పార్టీ గుర్తును స్ఫురించేలా పోస్టర్ ను రిలీజ్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ అంతా మహేష్ కు సపోర్ట్ గా నిలుస్తూ దీన్ని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ పోస్టర్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇలా పవన్-మహేష్ లే కాదు.. ఇప్పుడు వారి అభిమానులు కూడా ఒక్కటవ్వడంతో పండుగ వాతావరణం నెలకొంది.
Please Read Disclaimer