‘మహేష్’ నమ్రతలు ట్రెండ్ కు తగ్గట్లుగా..!

0సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్టార్ స్టేటస్‌ను ఉపయోగించుకుని రెండు చేతుల సంపాదిస్తున్నాడు. ఒకవైపు హీరోగా మరో వైపు లెక్కకు మించిన కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల మల్టీప్లెక్స్ నిర్మాణం కూడా మహేష్ బాబు చేపట్టినట్లుగా సమాచారం అందుతుంది. మహేష్ బాబుకు సంబంధించిన వ్యాపార విషయాలన్నీ కూడా నమ్రత చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆమద్య నిర్మాణ రంగంలోకి కూడా మహేష్ బాబు అడుగు పెట్టిన విషయం తెల్సిందే. జిఎంబీ బ్యానర్ ను ప్రారంభించిన మహేష్ బాబు సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామి అవుతున్నాడు.

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెల్సిందే. హాలీవుడ్ మరియు బాలీవుడ్ లో ఇది చాలా కాలంగా ఉంది. అయితే సౌత్ లో ఈమద్య వెబ్ సిరీస్ లపై స్టార్స్ ఆసక్తి చూపుతున్నారు. మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ నుండి వెబ్ సిరీస్ రాబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి ప్రచారం జరుగుతుంది. జియో వారితో ఒప్పందం చేసుకున్న మహేష్ బాబు ప్రొడక్షన్ సంస్థ ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ ను మొదలు పెట్టింది. ఆ వెబ్ సిరీస్ పూర్తి అయిన తర్వాత వరుసగా బ్యానర్ లో నిర్మాణాలు చేపట్టాలని నమ్రత భావిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

నమ్రతకు నిర్మాణ రంగంపై చాలా ఆసక్తి ఉందని ఆ కారణంగానే మహేష్ బాబు సొంతంగా బ్యానర్ ను ప్రారంభించినట్లుగా ఫిల్మ్ నగర్ సమాచారం. భారీ చిత్రాలు కాకుండా అభిరుచితో చిన్న బడ్జెట్ వెబ్ సిరీస్ లు – మినీ మూవీస్ – చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు సూపర్ స్టార్ దంపతులు సిద్దం అవుతున్నారు. కొత్త వారిని ప్రోత్సహించేందుకు ఒక టీంను కూడా వీరు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి స్క్రిప్ట్‌తో వస్తే వెంటనే నిర్మాణం మొదలు పెట్టేస్తాం అన్నట్లుగా నమ్రత అండ్ టీం చెబుతున్నారు. ట్యాలెంట్ హంట్ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి నమ్రత ట్రెండ్‌కు తగ్గట్లుగా వెబ్ సిరీస్ లు – మినీ మూవీ స్ వరుసగా నిర్మించాలని భావిస్తుందట.