మహర్షి: గెట్ రెడీ ఫర్ సెకండ్ గెటప్!

0సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ల్యాండ్ మార్క్ ఫిలిం ‘మహర్షి’ లో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రేపు లేదా ఎల్లుండి నుంచి అమెరికా లో స్టార్ట్ అవుతుంది. సినిమాకు అతి ముఖ్యమైన ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులు సాగుతుందట. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాలో షూటింగ్ కొనసాగిస్తారట. ఫైనల్ గా మళ్ళీ మరో షెడ్యూల్ అమెరికాలో ఉంటుందట.

ఈ ఆమెరికా షెడ్యూల్ లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మహేష్ ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తాడట. ఇప్పటివరకూ బియర్డ్ లుక్ లో కనిపించాడుగా.. ఇప్పుడు మాత్రం గడ్డం లేకుండా మరో కొత్త లుక్ లో కనిపిస్తాడట. మొదటి లుక్ తో ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసినట్టే ఈ లుక్ కూడా ప్రేక్షకులకు నచ్చేలా మహేష్- వంశీ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ కీలకమైన షెడ్యూల్ కోసం మహేష్ బాబు.. ఇతర యూనిట్ సభ్యులు ఇప్పటికే అమెరికాకు బయలుదేరారట.

మహేష్ బాబు కెరీర్లో ఇది 25 వ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో – అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.