మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభోత్సవం!

0mahesh-new-movie#మహేష్25 ఈరోజు మొదలైంది. శ్రీ వేంకటేశ్వర్ ఆర్ట్స్ బ్యానర్ పై దిల్ రాజు.. అలాగే వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్.. ఇద్దరూ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. వంశీ పైడిపల్లి డైరక్షన్లో రూపొందే ఈ సినిమా ముహూర్తం ఈవెంట్ ను కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు నిర్వహించారు. అయితే యథావిథిగా మహేష్ బాబు ఈ కార్యక్రమానికి రాలేదు.

నిజానికి తన సినిమాల ముహూర్తం ఈవెంట్లకు రాకపోవడం అనేది మహేష్ బాబుకు ఒక సెంటిమెంట్. ఇప్పటివరకు గత కొన్ని సంవత్సరాలుగా తన సినిమాల ముహూర్తం ఈవెంట్లో కేవలం నమ్రతా శిరోద్కర్ తప్పించి మహేష్ కనిపించడు. ఈరోజు మొదలైన వంశీ పైడిపల్లి సినిమాకు కూడా.. నమ్రతతో పాటు మహేష్ పిల్లలు గౌతమ్ అండ్ సితార కూడా విచ్చేసి రచ్చ చేశారు. చూస్తుంటే మహేష్ బాబుకు ఉన్న సెంటిమెంట్ వారి ఫ్యామిలీకి లేదనుకుంట. అందుకే ముహూర్తం ఈవెంట్లో వారి సందడి పీక్స్ కు చేరింది.

ఇకపోతే వంశీ రూపొందించే ఈ సినిమాను గతంలో పివిపి నిర్మించాల్సి ఉంది. ఏవో కారణాల వలన సినిమా అక్కడి నుండి దిల్ రాజు క్యాంపుకు షిఫ్టయ్యింది. స్వయంగా ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్ లో చేస్తున్నానంటూ మహేష్ ట్వీటేశాక.. పివిపి కోర్టుకెక్కారు కాని.. తరువాత విషయం నాలుగు గోడల మధ్యనే సెటిల్ అయిపోయింది. అది సంగతి.