మహేష్ నో చెప్పిందే నాని ఎస్ అన్నాడా ?

0

సినిమా పరిశ్రమలో ఒకరికి అనుకున్న కథలు ఇంకొకరికి వెళ్ళడం సర్వ సాధారణం. ముందుగానే ఊహించి ఫలితాలను అంచనా వేయడం అసాధ్యం కాబట్టి అప్పటికి తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనుకుని ముందుకు సాగడమే చేయాల్సింది. చరిత్రలో నిలిచిపోయిన షోలే గబ్బర్ సింగ్ పాత్ర ముందు అనుకున్నది డానీ డెంగ్జోపాకు. అతనికి కుదరకపోవడంతో అమ్జాద్ ఖాన్ ను వరించింది. తర్వాత జరిగింది చెప్పాల్సిన పని లేదు.

హీరోల విషయంలోనూ అంతే. పోకిరి మహేష్ కంటే ముందు పవన్ కు వినిపించాడట పూరి. పండుగా ప్రిన్స్ ని తప్ప ఎవరిని ఊహించలేనంత బాగా తీశాడు పూరి. సరిగ్గా ఇదే తరహాలో మహేష్ బాబు వద్దన్న కథ ఒకటి నాని చేస్తున్నాడు అంటే ఆశ్చర్యమేగా. అదే గ్యాంగ్ లీడర్. విక్రం కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో నాని ఐదుగురు వివిధ వయసుల్లో ఉన్న లేడి గ్యాంగ్ కు లీడర్ గా ఉంటాడు. ఎందుకు వాళ్ళను కలవాల్సి వచ్చింది వాళ్ళ భాద్యత ఎందుకు తీసుకున్నాడు లాంటి కారణాలు కథలో చూడాల్సిందే.

ఇది ముందుగా విక్రం మహేష్ కు వినిపించినట్టు ఫిలిం నగర్ టాక్. కాని ఇలా మహిళా బ్యాచ్ ని రక్షించే బ్యాచ్ తన ఇమేజ్ కు సూటవ్వదని భావించిన ప్రిన్స్ సున్నితంగా నో చెప్పినట్టు సమాచారం. ఇదే బన్నీకి చెప్పాడా లేక వేరేదా అనే క్లారిటీ లేదు కాని ఇమేజ్ తో సంబంధం లేకుండా రిస్క్ కు రెడీ అయ్యే నానిని ఫైనల్ గా గ్యాంగ్ లీడర్ వరించింది.ఒకవేళ నిజంగా మహేష్ చేసుంటే ఎలా ఉండేదో కాని గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ కార్డు మీద మహేష్ బొమ్మని ఊహించుకుంటే మాత్రం ఫాన్స్ కి కిక్కో కిక్కు. బట్ ఆ ఛాన్స్ మాత్రం మిస్ అయ్యింది
Please Read Disclaimer