మహేష్ సరసన అర్జున్ రెడ్డి భామ..

0అర్జున్ రెడ్డి చిత్రం తో విజయ్ దేవరకొండ కు ఎంత మంచి పేరు వచ్చిందో…అందులో హీరోయిన్ గా నటించిన
షాలిని పాండే కూడా అంతే పేరు వచ్చింది. ప్రస్తుతం ఈమె మహానటి మూవీ లో నటిస్తుంది. అలాగే తమిళం లో చేస్తుంది. ఇదిలా ఉండగానే ఈమెకు బంపర్ ఆఫర్ తగిలినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో షాలిని కి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. మెయిన్ హీరోయిన్ గా పూజ హగ్దే నటిస్తుండగా , ఓ ముఖ్య పాత్రలో షాలిని ని ఎంపిక చేశారట. త్వరలోనే ఈ వార్తను అధికారికంగా ప్రకటించనున్నారు. దిల్ రాజు – అశ్వినిదత్ నిర్మించనున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. ప్రస్తుతం మహేష్ భరత్ అనే నేను సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.