మహేష్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు

0mahesh-babu-about-garuda-veపూర్వవైభవమే లక్ష్యంగా కథానాయకుడు రాజశేఖర్‌ నటించిన చిత్రం ‘గరుడవేగ’. ఈ చిత్రం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఈ సినిమాను చూసిన సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చిత్ర బృందాన్ని అభినందించారు.

‘గొప్ప కథ.. చక్కటి ప్రదర్శన(నటన).. తెలివైన స్క్రీన్‌ప్లే.. ‘పీఎస్‌వీ గరుడవేగ’ అద్భుతంగా ఉంది.. మొత్తం చిత్ర బృందం అద్భుతంగా పనిచేశారు. రాజశేఖర్‌, దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుకు అభినందనలు’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. దీనికి రాజశేఖర్‌ వెంటనే స్పందించారు. ‘చాలా కృతజ్ఞతలు ప్రియమైన మహేశ్‌. సమయం తీసుకుని మరీ మా పనిని ప్రశంసించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

రూ.30 కోట్లతో నిర్మాత ఎం. కోటేశ్వరరావు ‘గరుడవేగ’ను నిర్మించారు. పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌, కిశోర్‌, నాజర్‌, పోసాని కృష్ణమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు అందించారు. ఇందులో రాజశేఖర్‌ నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో అసిస్టెంట్‌ కమిషనర్‌ అధికారిగా కనిపించారు. ఈ చిత్రం తొలి ఐదు రోజుల్లో రూ.15 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.