మహేష్ అభిమానుల నిరసన

0maheshbabuతమ అభిమాన హీరో మహేష్ బాబును కలవనివ్వలేదన్న ఆగ్రహంతో అభిమానులు ఆందోళనకు దిగిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఆయన కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ లక్డీకాపూల్ లో ప్రస్తుతం మూతబడివున్న ‘అమరావతి’ థియేటర్ లో జరుగుతోంది. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమను మహేష్ బాబుతో కలిపించాలని ఆయన పీఏ పరుచూరి కోటిని కోరగా, ఆయన నిరాకరించాడు.

దీంతో అభిమానులు కోటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. అభిమానుల నిరసన గురించి తెలుసుకున్న మహేహ్స్ తన షూటింగ్ ను ముగించుకుని మరోదారిలో బయటకు వెళ్లిపోయారు. దీంతో అభిమానుల ఆందోళన మరింత ఉద్ధృతం చేశారు. అయితే వారికి సర్దిచెప్ప అక్కడి నుంచి పంపేందుకు సైఫాబాద్ పోలీసులు నానా హైరానా పడాల్సివచ్చింది.

మహేష్ బాబు భరత్ అనే నేను షూటింగ్ తో బిజీగా వుంటున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.