పాకిస్తానీ ఖాన్ తో సోనమ్ కెమిస్ట్రీ భలే

0ఇంతకు ముందు వరకు ఇద్దరు హీరోయిన్లు కలిసి స్నేహితుల లాగా మెలగలేరు అని అనుకునేవారు కొంతమంది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. వాళ్ళ స్నేహం కంటే మాది గొప్పది అన్న రేంజ్ లో ఫ్రెండ్స్ అయిపోతున్నారు మన సినీ తారలు. ఇదిలా ఉండగా ఈమధ్యనే కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇద్దరు హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వారం క్రితమే పెళ్లి చేసుకున్న ఒక బాలీవుడ్ నటి మరియు ఒక పాకిస్తానీ హీరోయిన్ కేన్స్ ఈవెంట్ లో సందడి చేశారు. వాళ్లే సోనమ్ కపూర్ మహీర ఖాన్. ఈ మధ్యనే తన ప్రేమకధను పెళ్లి పీటలు ఎక్కించిన సోనమ్ కపూర్ షారుఖ్ ఖాన్ నటించిన రాయిస్ సినిమాలో కనిపించి మెప్పించిన మహిరా ఖాన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తమదైన రీతిలో దర్శనమిచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఫోటో కి పోజ్ ఇవ్వగా ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.

సోనమ్ కపూర్ ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు ఈ ఫెస్టివల్ కు హాజరు అవ్వగా మహిర కు మాత్రం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా ఈ ఇద్దరు తారలు ఎప్పట్నిండో పరిచయం ఉన్న వ్యక్తుల లాగా బాగానే కలిసిపోయారు. సోనమ్ మహీరకు ముద్దు పెడుతూ ఫోటోలకు పోజ్ ఇవ్వడం విశేషం. మొత్తానికి వీరిద్దరి కెమిస్ట్రీ అదుర్స్ అంటూ ఫాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.