మజిలీ 28 డేస్ కలెక్షన్స్

0

అక్కినేని నాగచైతన్య.. సమంతా.. దివ్యాన్ష కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘మజిలి’ రిలీజై దాదాపుగా నెల కావస్తోంది. అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధిస్తూ ముందుగు సాగుతుండడం విశేషం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ‘జెర్సీ’.. ‘కాంచన 3’ వచ్చినా.. ఈమధ్య ‘అవెంజర్స్’ దుమ్ము దులిపినా ‘మజిలీ’ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన పని తాను చేసుకుపోతోంది.

28 రోజులకు ‘మజిలీ’ తెలుగు రాష్ట్రాల్లో రూ.30.07 కోట్ల థియేట్రికల్ షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.38.52 కోట్లు వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్స్ అయితే 68.05 కోట్లు. ‘మజిలీ’ పాతిక కోట్ల షేర్ మార్క్ దాటగానే చైతు కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా ఈ సినిమా 30 కోట్ల షేర్ క్లబ్ లోకి చేరింది. మరి ఫుల్ రన్ లోపు నలభై కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందేమో వేచి చూడాలి.

ప్రపంచవ్యాప్తంగా ‘మజిలీ’ 28 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 13.02 cr

సీడెడ్: 4.48 cr

ఉత్తరాంధ్ర: 4.52 cr

కృష్ణ: 1.85 cr

గుంటూరు: 2.08 cr

ఈస్ట్ : 1.82 cr

వెస్ట్:1.38 cr

నెల్లూరు: 0.92 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ.30.07 cr

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 4.40 cr

ఓవర్సీస్: 4.05 cr

వరల్డ్ వైడ్ టోటల్ షేర్: రూ.38.52 cr

వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్: రూ. 68.05 cr
Please Read Disclaimer