‘2.ఓ’ అంతకుమించి

0రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘2.ఓ’. శంకర్‌ దర్శకుడు. అమీ జాక్సన్‌ కథానాయిక. అక్షయ్‌ కుమార్‌ విలన్ పాత్ర పోషించారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతరం కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే మేకింగ్‌ వీడియోలను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ‘మేకింగ్‌ ఆఫ్‌ 2.ఓ వీఎఫ్‌ఎక్స్‌ ఫీచర్టీ’ పేరుతో ఒక వీడియో విడుదల చేసింది. సినిమా కోసం చిత్ర బృందం ఎంత కష్టపడుతుందో ఈ వీడియో ద్వారా చూపించారు.

రోబో కోసం ఉపయోగించిన వీఎఫ్‌ఎక్స్‌ కన్నా రెండింతలు ఇందులో ఉంటుంది. సన్నివేశాన్ని వూహించడమనేది చాలా పెద్ద విషయం. దాన్ని కేవలం వీఎఫ్‌ఎక్స్‌ ద్వారా సాకారం చేయగలం. మనం స్క్రిప్ట్‌లో రాసుకున్న ఆలోచనలు, భావాలు ఇతరులతో పంచుకోవడం చాలా కష్టతరమైన పని. అందుకని అంతా ఒక గేమ్‌రూపంలో మార్చి దాన్ని అందరికీ అర్థమమ్యేలా చెప్పాం. ప్రేక్షకుడు వీఎఫ్‌ఎక్స్‌ ఫీల్‌కాకూడదు. అలాంటిదే అత్యుత్తమ వీఎఫ్‌ఎక్స్‌. థియేటర్‌లో సినిమా చూసే ప్రేక్షకుడు కథలో, సినిమాలో లీనం కావాలి. హాలీవుడ్‌ సినిమాను ఆస్వాదించే ప్రతీ ప్రేక్షకుడూ దీన్ని ఆస్వాదిస్తాడు” అని చెప్పారు శంకర్