ఫిట్టెస్ట్.. హాటెస్ట్@45

0

అనగనగన ఒక మంత్ర గత్తె.. వృద్ధాప్యాన్ని జయించి నిత్య యవ్వనంతో మరణం అన్నదే లేకుండా బతకాలనుకుంది. అలా జరగాలంటే ఏం చేయాలి? అందుకోసం ఇంకా స్త్రీ సాంగత్యం జోలికి వెళ్లని ఒక టీనేజీ కన్నె పురుషుడిని నిండు పౌర్ణమి రోజు కులదైవానికి బలి ఇవ్వాలనేది మంత్రగత్తె రాజమాత ఆదేశం. అప్పుడా మంత్రగత్తె ఏం చేసింది?

ఏమో..!! ఆ మంత్ర గత్తె ఏం చేసిందో తెలీదు కానీ ఇదిగో ఇహలోకంలో మంత్రగత్తె మాత్రం చాలానే చేస్తోంది. నిత్యం జిమ్ముల్లో కసరత్తులు చేస్తోంది. పెర్ఫెక్ట్ ఫిట్ నెస్ మెయింటెయిన్ చేస్తోంది. 45 వయసులోనూ టీనేజీ మిసమిసలతో మతి చెదరగొడుతోంది. తనవైన అందచందాలతో కుర్రకారుని మతి తప్పేలా చేస్తోంది. బోయ్స్ తననే పదే పదే కలవరించేలా తన దేహశిరుల్ని కాపాడుకుంటూ.. నిత్య యవ్వనంతో తులతూగుతోంది. ఈ పెర్ఫెక్ట్ ఫిట్ బ్యూటీ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ది గ్రేట్ డ్యాన్సర్.. మెరుపుతీగ మలైకా అరోరాఖాన్ గురించి ఇంట్రడక్షన్ అన్నదే అఖ్కర్లేదు. సెలబ్రిటీ ప్రపంచంలో ఫిట్ నెస్ కి – గ్లామర్ మెయింటెనెన్స్ కి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ.. ఫిట్ గా కనిపిస్తేనే అవకాశాలొస్తాయి. ఈ సూత్రాన్ని తూ.చ తప్పక పాటిస్తూ సన్నజాజి తీగలా దేహాన్ని తీర్చిదిద్దింది మలైకా. అందుకేనేమో ఇంకా 30లోనే ఉన్నా అర్జున్ కపూర్ ఈ అందగత్తెకు ఫిదా అయిపోయాడని యంగ్ గయ్స్ లో మాటా మంతీ సాగుతోంది. ఫిట్టెస్ట్.. హాటెస్ట్@45 ఈ ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు. జిమ్ములో కసరత్తులు పూర్తి చేసుకుని మలైకా ఇలా దర్శనమిచ్చింది.
Please Read Disclaimer