ఇదిగో హాట్ టిక్కెట్టు

0కొన్ని సినిమాలంతే. కొన్ని పాత్రలంతే. టాలెంటుని సరిగ్గా వాడుకోలేవు. ఇదిగో ఈ నేలటిక్కెట్టు భామని ఇలా హాట్ అవతారంలో చూశాక మీరు కూడా ఆ మాటని ఒప్పుకోవల్సిందే. రవితేజ కథానాయకుడిగా నటించిన `నేలటిక్కెట్టు`లో ఈ ముద్దుగుమ్మ చాలా ఇన్నోసెంట్ గా కనిపించింది. ఇకపై కూడా ఇలాంటి పాత్రల్లోనే కనిపిస్తుందేమో అనిపించింది. కానీ ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందని ఎవ్వరూ ఊహించి ఉండరు. నేలటిక్కెట్టు ఫ్లాప్ కావడంతో ఈమె పేరు కూడా గుర్తుంచుకోలేదు చాలామంది. కానీ ఇక్కడిలా హాట్ హాట్ అందాలతో అదరగొడుతుంటే పేరు అడగకుండా – ఈమె అడ్రస్ ని ఆరా తీయకుండా ఎమరు మాత్రం కామ్ గా ఉంటారు.

ఈమె పేరు.. మాళవిక శర్మ. హాట్ హాట్ అందాలతో అదరగొట్టడంలో బోలెడంత ప్రతిభ ఉంది. ఇక్కడ కూడా ఆ విషయాన్నే చాటి చెబుతోంది. తొలి సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఈమె ఇటీవల హాట్ హాట్ ఫొటోషూట్ లతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. మరి ఇంత టాలెంట్ దర్శకనిర్మాతల కంట పడకుండా ఎలా ఉంటుంది చెప్పండి? మాళవికకి మరో ఆఫర్ తెలుగు నుంచి ఖాయం అనిపిస్తోంది కదూ!