స్టార్ హీరో సీక్రెట్ ఎఫైర్.. ఆత్మహత్య బెదిరింపు

0

మలయాళ సీనియర్ నటుడు దిలీప్ కొన్నాళ్ల క్రితం కేరళ వరకు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే హీరోయిన్ కిడ్నాప్ మరియు లైంగిక వేదింపుల కేసు బయటకు వచ్చిందో అప్పటి నుండి కూడా ఇతడి గురించి ఒక్కో విషయం బయటకు వస్తూనే ఉంది. ఈయన్ను మలయాళ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి తొలగించడం ఆ తర్వాత చేర్చడం దానిపై పెద్ద ఎత్తున దుమారం రేగడం వంటివి జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఈయన రెండవ వివాహం గురించి ఒక సీనియర్ జర్నలిస్ట్ సంచలన విషయాలను బయట పెట్టాడు.

దిలీప్ 1998లో హీరోయియన్ మంజు వారియర్ ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన సంవత్సరంకే కావ్య మాధవన్ తో ఒక సినిమాలో నటించిన సందర్బంగా పరిచయం అయ్యింది. ఇద్దరి మద్య పరిచయం ప్రేమగా మారింది. దిలీప్ కు పెళ్లి అయ్యిందనే విషయం తెలిసి కూడా కావ్య అతడిని ఇష్టపడింది. ఇద్దరి ప్రేమ వ్యవహారం చాలా వరకు సాగింది. దిలీప్ పై ఉన్న ప్రేమతో కావ్య ఇంట్లో వారు పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేసినా వద్దంటూ వారించడం మొదలు పెట్టింది. కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడి చేయడంతో నిషాల్ చంద్రతో వివాహానికి ఒప్పుకుందట. కావ్య వివాహంకు ఒప్పుకున్న విషయం తెలిసి దిలీప్ ఆమెను హెచ్చరించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడట. నిషాల్ కు మన పర్సనల్ ఫొటోలు పంపిస్తానంటూ బెదిరించాడట. కావ్య కూడా ఇష్టం లేకుండానే నిషాల్ ను వివాహం చేసుకుంది.

వివాహం చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కావ్యను కలిసి మరీ బెదిరించాడట. ఆత్మహత్య చేసుకుంటాను అంటూ చెప్పడంతో సమయం చూసి నిషాల్ ను వదిలేసి నీ వద్దకు వస్తానంటూ దిలీప్ కు హామీ ఇచ్చిందట. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి అయిన సంవత్సరానికే నిషాల్ ను వదిలేసి కావ్య వచ్చేసింది. అదే సమయంలో మంజు వారియర్ కు దిలీప్ విడాకులు ఇచ్చాడు. ఇద్దరు కలిసి కొంత కాలం సహజీవనం సాగించిన తర్వాత 2016లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక పాప కూడా ఉంది. దిలీప్ గురించి ఇప్పటికే పలు విమర్శలు ఉన్న నేపథ్యంలో సదరు జర్నలిస్ట్ చెప్పిన ఈ సీక్రెట్ ఎఫైర్ ఆయన క్రేజ్ ను మరింత దిగజార్చే విధంగా ఉంది. దిలీప్ ఇండస్ట్రీకి దూరం అవ్వడం ఖాయంగానే కనిపిస్తుంది.
Please Read Disclaimer