సినీ నటి ప్రైవేట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్..

0


mythili-photos-leaked-onlinమలయాళ నటిపై లైంగిక దాడి ఘటన మరిచిపోకముందే కేరళ చిత్ర పరిశ్రమలో మరో సంఘటన చోటు చేసుకొన్నది. సినీ నటి మైథిలీ ప్రైవేట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ కావడం సంచలనం రేపింది. ఈ ఘటనకు బాధ్యుడైన ప్రొడక్షన్ ఎగ్గిక్యూటివ్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో మరోసారి మలయాల చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది.

2008 నుంచి మైథిలీ, కిరణ్ కుమార్ స్నేహితులు. అప్పటి నుంచి కొంతకాలం డేటింగ్ చేశారు. ఆమెను పెళ్లి చేసుకొంటానని నమ్మించాడు. కానీ అప్పటికే కిరణ్ పెళ్లి అయినట్టు, కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడనే నిజం బట్టబయలు అయింది. నిజాలు దాచి పెట్టి మోసగించాడని తెలుసుకొన్న మైథిలీ అతడితో తెగతెంపులు చేసుకొన్నది.

మైథిలీ తనను దూరంగా పెట్టడంతో కిరణ్ ఆమెపై ద్వేషం పెంచుకొన్నారు. ఆమెను ఎలానైనా ఇబ్బంది పెట్టాలని భావించిన కిరణ్.. ఆమె సీక్రెట్ ఫోటోలను లీక్ చేస్తానని బెదిరించాడు. దాదాపు రూ.75 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. లేకపోతే డేటింగ్ చేసినప్పుడు తనతో అతి సన్నిహితంగా దిగిన ఫొటోలను ఇంటర్నెట్‌ లీక్ చేస్తానని బెదిరించాడు.

కిరణ్ బెదిరింపులకు లొంగకపోవడంతో మైథిలీని షూటింగ్ స్పాట్‌కు వెళ్లి ఇబ్బంది పెట్టాడు. కిరణ్ ప్రవర్తనతో సహనం కోల్పోయిన మైథిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన ఉత్తర ఎర్నాకులం పోలీసులు కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఐపీసీ, పలు ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి అతడిని విచారిస్తున్నారు.

కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశాం. మైథిలీకి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా అనే కోణంలో విచారణ చేపట్టాం. అతడి నుంచి వివరాలు సేకరిస్తున్నాం. కొన్ని ఫొటోలను షేర్ చేసినందుకు నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశాం అని పోలీసుల చెప్పినట్టు ప్రముఖ దిన పత్రిక కథనాన్ని వెల్లడించింది.

మైథిలీ పలెరీ మాణిక్యం అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. పలెరీ మాణిక్యం చిత్రంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా అవార్డును కూడా సొంతం చేసుకొన్నది. హానీ బీ, మాయ మోహిని చిత్రాల్లో ఆమె నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి.