జుట్టుకు మినరల్ వాటర్ కావాలన్న ఇటం బామ

0Mallika-sherawatచిత్ర పరిశ్రమలో టాప్ స్థానం వచ్చిన తర్వాత కథానాయికలు కానీ ఐటెం అందగత్తెలు కానీ చేసే డిమాండ్స్ వింతగా ఉంటాయంటే చూసే వాళ్ళు ‘అవసరమా అంతా’  అని తిట్టుకుంటూ ఉంటారు. తాజాగా ఇటువంటి బిల్డప్ ఓ హీరోయిన్ చూపించింది. ఏకంగా తన హెయిర్ వాష్ చేసుకునేందుకు మినరల్ వాటర్ కావాలని ఐటెం రాణి మల్లికా శెరావత్ మొండికేసింది. దాంతో అందరూ హైరానా పడ్డారు.

మల్లికా శెరావత్ తన రియాల్టీ షో ‘ది బ్యాచిలరేట్ ఇండియా’ కోసం ఉదయ్ పూర్ లో సందడి చేస్తుంది. అక్కడ ఓ హోటల్ లో దిగిన మల్లికా తా హోటల్ లోని నీటికి తన జుట్టు డ్రై అవుతుందట. దాంతో ” నా జుట్టుకు మినరల్ వాటర్ కావాలని” ఆర్డర్ వేసిందట. దాంతో వారు చేసేది లేక ఆలస్యం అయిన మల్లిక అడిగిన మినరల్ వాటర్ తీసుకొచ్చారు.

అయితే ఇటువంటి డిమాండ్స్ మల్లికా చేయడం మొదటి సారి కాదు. గతంలో నటించిన ఓ సినిమా లాంగ్ ట్రిప్ కోసం వెళ్ళే వాహనంలో పదిహేను మంది పట్టే లగ్జరీ కారులో తనతో నలుగురే ప్రయాణించాలని ఆర్డర్ వేసింది. మరోసాని షూటింగ్ సాప్ట్ లో ‘అల్పనోస్ మ్యాంగోస్’ కావాలని నిర్మాతలకు చుక్కలు చుపించింది. దాంతో మల్లిక తో నటింపచేయాలంటే కష్టమేమి కాదు కానీ ఆమె డిమాండ్స్ తీర్చడం తలనొప్పి అంటూ బాధపడుతున్నారు.