స్టుపిడ్ చిన్మయి.. వైరముత్తును పెళ్లి చేసుకో

0

తమిళ లెజెండ్రీ రచయితగా పేరు దక్కించుకున్న వైరముత్తు గత కొంత కాలంగా లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ప్రముఖ గాయని – డబ్బింగ్ ఆర్టిస్టు అయిన చిన్మయి చాలా కాలంగా వైరముత్తును టార్గెట్ చేస్తూనే ఉంది. తనకు 18 ఏళ్లు ఉన్న సమయంలో వైర ముత్తు నన్ను లైంగికంగా వేదించాడు – తన రూంకు రమ్మని అడిగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు మాత్రమే కాకుండా ఇంకా చాలా మందికి కూడా వైర ముత్తు వల్ల చేదు అనుభవం ఎదురైందని చిన్మయి చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలపై వైరముత్తు పెద్దగా స్పందించలేదు.

ఆయన మద్దతుదారులు మరియు అభిమానులు మాత్రం చిన్మయిని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇలా ప్రయత్నించడం ఏ మాత్రం సబబు కాదంటూ చాలా మంది ఆమెను హెచ్చరించారు. అదే సమయంలో తమిళ సినీ పరిశ్రమ వారు కూడా ఆమెకు అనధికారికంగా సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఆమెకు అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారట. ఈ సమయంలోనే ఒక వ్యక్తి చిన్మయి గురించి అసభ్యంగా పోస్ట్ చేశాడు. చిన్మయి చేసిన ఒక పోస్ట్ కు కట్టి అనే పేరు ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో.. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది – నువ్వు వైరముత్తును పెళ్లి చేసుకో. గత కొన్ని రోజులుగా పిచ్చి పట్టినదాని మాదిరిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీకేం పని పాట లేదా స్టుపిడ్. ఎప్పుడు చూసినా ఆయన గురించే మాట్లాడుతున్నావు నవ్వు బీజేపీ వారు మాట్లాడిస్తే మాట్లాడుతున్నావనిపిస్తుందని కామెంట్ చేశాడు.

అతడి కామెంట్ పై చిన్మయి స్పందిస్తూ మీ ఐడియా చాలా బాగుంది – కాని నాకు ఆసక్తి లేదు అంటూ కౌంటర్ ఇచ్చింది. అదే సమయంలో తన భర్త గతంలో చిన్మయిని ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం చేస్తూ చేసిన పోస్ట్ ను కూడా ఆమె జత చేసింది. నా భార్య గురించి నా వాల్ పై కొందరు పనికిమాలిన రాతలు రాస్తున్నారు. వాటిని కట్టి పెట్టుకోండి – మీ పని మీరు చూసుకోండి. తన గురించి – తన వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. మీరు కూడా అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అయితే మీలాంటి వారిని అలాంటి గుణం ఉన్న అమ్మాయి చేసుకోవడం కష్టమే అంటూ రాహుల్ రవీంద్ర గతంలో పోస్ట్ చేశాడు.
Please Read Disclaimer