బిగ్‌బాస్‌ హౌస్‌లో సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం

0man-dies-on-bigg-boss-tamilవిలక్షణ నటుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో అపశృతి చోటుచేసుకొన్నది. బిగ్‌బాస్ సెట్లో పనిచేస్తున్న ప్లంబర్ మరణించడంతో ఈ షోను మరో వివాదం చుట్టుకొన్నది. మంగళవారం చోటుచేసుకొన్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అంతేకాకుండా ఈ షోలో ఓవియా స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశమైంది. రియాలిటీ షో మొదలైన తర్వాత అనేక వివాదాలు ఈ కార్యక్రమాన్ని చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. తమిళ సంప్రదాయాలకు విరుద్దంగా ఈ కార్యక్రమం సాగుతున్నదనే ఆరోపణలపై ఇప్పటికే పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

మీడియా కథనాల ప్రకారం.. ముంబైకి చెందిన ఇబ్రహీం షేక్ బిగ్‌బాస్ సెట్లో కొద్దిరోజలుగా పనిచేస్తున్నాడు. అనారోగ్య కారణాల వల్ల సెట్లోనే కుప్పకూలడంతో వెంటనే అత్యవసర వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత కిల్పాక్ మెడికల్ కాలేజీకి తరలించడానికి ప్రయత్నిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస వదిలారు.

ఈ ఘటనపై నజార్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షేక్ అనారోగ్యంగా ఉందని తోటి కార్మికులకు చెప్పాడు. విపరీమైన చెమటలు పట్టి అక్కడే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం వివాదంగా మారింది.