ఇళయరాజా పాటకు ఏనుగు నిద్ర..

0

సంగీతానికి చింతకాయలు రాలుతాయో ఏమీ తెలియదు కానీ.. ఆ సంగీతంతో రోగాలు నయం చేయవచ్చని.. అదే సంగీతంతో హాయిగా కంటినిండా నిద్రపోవచ్చని ఓ గజరాజు లైవ్ లో చూపించారు. సంగీతానికి ఉన్న గొప్పతనాన్ని ఈ మూగ జంతువు ప్రపంచానికి చాటిచెప్పింది. ఇంతకీ సంగీతంతో ఆ ఏనుగు ఏం పొందింది అంటే నిద్రే.. ఔను నిద్రపోయింది..

కేరళ రాష్ట్రంలోని తిరుచ్చూర్ కు చెందిన మావటి శ్రీకుమార్ ఓ ఏనుగును అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఏమైందో ఏమో కానీ ఏనుగు కొద్ది కాలంగా నిద్రపోకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. డాక్టర్లకు చూపించినా నయం కాలేదు. ఇలా కాదనుకొని శ్రీకుమార్ ఓ మాస్టర్ ప్లాన్ వేశారు.

దక్షిణాదిలోనే ఫేమస్ సంగీత దర్శకుడైన .. మేలోడి మ్యాస్టో ఇళయ రాజ పాటను పాడి ఆ ఏనుగును నిద్రపుచ్చాడు. ఇళయ రాజా పాట వింటూ మైకంలోకి వెళ్లి ఆ ఏనుగు నిద్రపోయింది. ఇళయరాజా పాటే లాలీపాటగా ఆ ఏనుగును నిద్రపుచ్చింది. ఈ వీడియోను కొందరు ఔత్సాహికులు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఇంతకీ ఏనుగును నిద్రపుచ్చిన ఆ పాట ఏంటి అని అనుకుంటున్నారా..? 1984లో మమ్ముట్టి హీరోగా వచ్చిన మలయాళ చిత్రంలోని ఇళయరాజా కంపోజ్ చేసిన మేలోడీ సాంగ్ అదీ..
Please Read Disclaimer