ఇలాంటి ప్రియుడు ఉంటే చాలు!

0Man-wears-girlfriend-pink-healsనిజంగా ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. అంత అర్థం చేసుకునే ప్రియుడు పక్కనే ఉంటే అంతకంటే ఓ ఆడపిల్లకు ఏం కావాలి చెప్పండి. ఇంతకీ ఆ యువకుడు అంతగా మెచ్చుకునేంత పని ఏంచేశాడంటే..

చైనాలోని షాపింగ్బా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలిని చెకప్‌ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆస్పత్రికి వెళ్లేటప్పుడు ఆ యువతి హైహీల్స్‌ వేసుకుంది. దాంతో ఆమెకు తీవ్రమైన కాళ్లనొప్పులు మొదలయ్యాయి. ప్రియురాలి బాధపడుతుంటే చూడలేక ఆ యువకుడు తన చెప్పులు ఆమెకి ఇచ్చి ఆమె హీల్స్‌ తాను వేసుకున్నాడు.

వీరిద్దరూ చెప్పులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ఆస్పత్రిలో ఉన్న ఓ యువతి ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ యువకుడి గురించి తెలిసిన అమ్మాయిలంతా ఇలాంటి ప్రియుడు తమకూ ఉంటే ఎంత బాగుండో అని కామెంట్లు పెడుతుంటే..