డిఫరెంట్ గెటప్ లో మంచు లక్ష్మి

0Manchu Lakshmi Photo Shootసినిమా యాక్టర్ గా.. టీవీల్లో హోస్ట్ గా.. రీసెంట్ గా అవార్డ్ ఫంక్షన్లలో యాంకర్ గా కూడా ట్యాలెంట్ చూపించేస్తోంది మంచు లక్ష్మి. డిఫరెంట్ కేరక్టర్స్ చేయడంలో ఈ మంచు వారసురాలికి బోలెడంత ఇంట్రెస్ట్ ఉంది. అలాగే ఫోటో షూట్స్ తో కూడా ఈ భామ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

సినిమాల్లో డిఫరెంట్ గెటప్స్ తో అలరించినా.. ఫోటోషూట్స్ లో మాత్రం మోడ్రన్ ఔట్ ఫిట్స్ అలరించడం మంచు లక్ష్మి హాబీ. కానీ తాజాగా ఈమె చేసిన ఓ ఫోటో షూట్ అందరికీ మతులు పోగొట్టేసింది. ఒక్కసారిగా అడవి పడుచు మాదిరిగా మారిపోయి పోజులు ఇచ్చేసింది. చీర కట్టు.. మొహాన పెట్టిన బొట్టు.. ధరించిన ఆభరణాలు.. ముక్కు పుడకలు.. పెద్ద సైజులో కర్ణాభరణాలు.. తలలో చేతిలో.. పెద్ద పెద్ద పూలు.. అబ్బో ట్రైబల్ గెటప్ లో మంచు లక్ష్మి చూపించిన గెటప్.. అందరినీ మెస్మరైజ్ చేసేసింది.

ఎలాంటి గెటప్ లో అయినా తాను ఎలా ఇమిడిపోతుందో.. అందుకోసం తను ఎలాంటి రిస్క్ చేయగలుగుతుందో చెప్పేసింది మంచు లక్ష్మి. ప్రస్తుతం అడవి అందాల చిన్నదిగా మంచు లక్ష్మి ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం మంచు లక్ష్మి నటించిన లక్ష్మీ బాంబ్ అనే మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది.