ఆమె కొత్త సినిమాలో ఆడాళ్లే స్పెషల్

0Manchu-Lakshmi-New-Movie-Launchమంచు మోహన్ బాబుగారి అమ్మాయి మంచి లక్ష్మి ప్రసన్న సినిమాలలోకి రాకముందు నుండే మంచి ఫేమస్. సినిమాలోకి వచ్చిన అతి కొద్ది కాలంలో స్టార్ అయి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఏర్పర్చుకుంది. టివి హోస్ట్ గా స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా హీరోయిన్ గా కొనసాగుతుంది. లక్ష్మి గత కొద్ది కాలంగా సినిమాకు కొంచం దూరంగా ఉందినే చెప్పాలి. ఒక బలమైన కథ కోసం మంచి టీమ్ కోసం చూస్తున్న ఈ మంచు ఫైర్ బ్రాండ్ ఇప్పుడు తనే హీరోయిన్ గా ఒక సినిమాను మొదలుపెట్టింది. ఈ సినిమాకు ఒక స్పెషల్ ఉంది అది ఏంటి అంటే ఈ సినిమాకు పని చేయబోతున్న చాలామంది కొత్తవాళ్లే.

మంచు ఎంటర్టైన్మెంట్ బేనర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు యెస్ యెస్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన విజయ్ అనే కొత్త డైరెక్టర్ చేయబోతున్నాడు. ఈ కథ మొత్తం మంచు లక్ష్మి పాత్ర చుట్టూ ఉండబోతుంది అని తెలిస్తోంది. ఆడవాళ్ళ ఆలోచనలకు మనం ఇప్పుడు బతకుతున్న నిజ జీవితానికీ మధ్య ఒక ఆడది ఏ విదమైన సంఘర్షణకు గురి అవుతుందో ఈ సినిమా ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెబుతున్నారు మంచు వారి టీమ్. ఆడవాళ్ళు వాళ్ళు కలలు కోసం మన వ్యవస్థ తో ఎలాంటి పాట్లుపడతారో అనేది కథాంశం. లక్ష్మి ప్రసన్న కు ఈ కథ చాలా బాగా నచ్చిందిని చెబుతుంది. నేను ఎప్పటి నుండో ఇలాంటి కథ కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపింది.

సినిమా కథకు తగ్గట్లే ఈ సినిమాకు పని చేసిన వారు కూడా ఎక్కువమంది ఆడవాళ్లే. ఈ సినిమాకు నిర్మాతగా సుహాసిని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ లత చేస్తుంది. మంచు అమ్మాయి ఏమో ముఖ్యపాత్రదారిగా నటిస్తుంది. సినిమా షూటింగ్ నిన్నే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.