రవితేజకు మంచు లక్ష్మి సర్టిఫికెట్

0Manchu-Lakshmi-Supports-Ravi-tejaఈ మధ్య రవితేజకు డ్రగ్స్ కేసుకు సంబంధించిన నోటీసులు రావడం.. సిట్ అధికారులు అతణ్ని విచారించడం కలకలం రేపింది. ఆ సమయంలో ఇండస్ట్రీ జనాల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. రవితేజకు మద్దతుగా మాట్లాడిన వాళ్లు తక్కువమంది. అనవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోవడం ఎందుకని చాలా మంది ఊరుకున్నారో ఏంటో తెలియదు కానీ.. చాలామందికి సన్నిహితుడిగా పేరున్న మాస్ రాజాగా పరిశ్రమ నుంచి తగినంత సపోర్ట్ లభించలేదన్న అభిప్రాయం అయితే వినిపించింది. ఐతే ఇప్పుడు మంచు లక్ష్మి మాస్ రాజాకు మద్దతుగా మాట్లాడింది. డ్రగ్స్ ఊసెత్తకుండానే రవితేజ ఎంత పద్ధతైన వాడో.. అతడి అలవాట్లు ఎలా ఉంటాయో ఓ ఇంటర్వ్యూలో వివరించింది లక్ష్మి.

రవితేజ క్యూట్ పర్సన్ అని.. తనకున్నవన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే అని మంచు లక్ష్మి తెలిపింది. తనకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవని తెలిపింది. ఒక రోజు రవితేజకు చెప్పకుండా తన ఇంటికి వెళ్లిపోయానని.. వాళ్లింట్లో తింటూ రవితేజకు ఫోన్ చేస్తే.. నాకెందుకు చెప్పలేదు అని అడిగాడని.. ‘నీకు చెబితే అన్నీ ఆకులు అలుములు పెడతావు’ అని చెప్పానని.. రవితేజ ఫుడ్ విషయంలో అంత జాగ్రత్తగా ఉంటాడని.. తన కొడుకు గురించి రవితేజ తల్లి కూడా తన దగ్గర బాధపడుతుంటుందని.. ‘ఏమీ తినడు.. నువ్వైనా చెప్పమ్మా’ అని తనను అడుగుతుంటుందని మంచు లక్ష్మి చెప్పింది. ఒక రోజు రామోజీ ఫిలిం సిటీలో తాను.. రవి వేర్వేరు ఫోర్లలో షూటింగ్ చేస్తూ ఉండి తర్వాత భోజనానికి కూర్చున్నామని.. రవితేజ లైట్ గా తినేసి వెళ్లిపోయాడని.. అతను తన గదికి వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చినా తాను తింటూనే ఉన్నానని.. అది చూసి ‘నా తల్లే.. ఏం తింటున్నావో.. మొత్తం తినేయ్’ అన్నాడని.. ఆ దృశ్యం తన కళ్ల ముందు నిలిచిపోతుందని.. ఫుడ్ విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండే రవితేజ.. వేరే అలవాట్ల జోలికి అస్సలు వెళ్లడని మంచు లక్ష్మి సర్టిఫికెట్ ఇచ్చింది.