మొత్తానికి మంచు లక్ష్మి సెలెక్ట్ అయ్యింది

0వెండి తెరకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన మంచు లక్ష్మి మొత్తానికి మరో సినిమాతో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలను చేస్తున్న ఈ మల్టి టాలెంటెడ్ యాక్టర్ మరికొన్ని రోజుల్లో వైఫ్ ఆఫ్ రామ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట వెబ్ సిరీస్ అంటూ స్టార్ట్ చేసిన ఈ కథను ఫైనల్ గా వెండి తెరపైకి తీసుకు వచ్చారు. తప్పకుండా సినిమా అందరిని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది.

ఇకపోతే ఈ సినిమా ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి సెలెక్ట్ అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో తెరక్కిన ఈ సినిమా లో మంచు లక్ష్మి రామ్ అనే వ్యక్తి భార్య పాత్రలో కనిపించనుంది. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే అసలు కథ ఆసక్తిని రేపుతుందని తెలుస్తోంది. ఇకపోతే OIFFA కి సెలెక్ట్ అవ్వడంతో సినిమాకు క్రేజ్ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. విజయ్ యేలకంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇక పీపుల్స్ ఫ్యాక్టరీతో కలిసి మంచు లక్ష్మి తన సొంత బ్యానర్ లో సినిమాను నిర్మించింది. ఫైనల్ గా సినిమా జూన్ 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సామ్రాట్ రెడ్డి ఆదర్శ్ బాలకృష్ణ ప్రియదర్శి పులికొండ శ్రీకాంత్ అయ్యర్ మరియు కొందరు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మరి ఈ సినిమాతో మంచు లక్ష్మి కమర్షియల్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.