పార్టీ మూడ్ లో మన్మధుడు అండ్ టీం

0

నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతోంది. గత రెండు వారాలుగా మన్మధుడు 2 చిత్రంను అక్కడ షూట్ చేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా పార్టీ చేసుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా నాగార్జున మరియు అమలలు పార్టీ ఇచ్చారు. అయితే ఈ పార్టీలో వెన్నెల కిషోర్ లేట్ అయ్యాడు. దాంతో వెన్నెల కిషోర్ పై నాగార్జున కాస్త కోపగించుకున్నాడు. నీలాంటి డిజిటల్ ప్రపంచంలో జీవించే వారికోసం ఈ పార్టీ ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి అంటూ సన్నితంగా వార్నింగ్ ఇచ్చాడు.

పార్టీకి తాను ఆలస్యంగా రావడం గురించి వెన్నెల కిషోర్ స్పందిస్తూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. మంచు లక్ష్మి వల్ల ఆలస్యం అయినట్లుగా వెన్నెల కిషోర్ అన్నాడు. అయితే మంచు లక్ష్మి మాత్రం తనను రకుల్ ప్రీత్ సింగ్ రూంలో వదిలేసి వెళ్లిందని అందువల్లే లేట్ అయ్యిందని సరదాగా కామెంట్ చేసింది. మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలను వెన్నెల కిషోర్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారం సరదాగా సాగింది. మొత్తానికి చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా మస్త్ పార్టీ మూడ్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

పోర్చ్ గల్ లో షూటింగ్ చేస్తూ సరదాగా వీరంతా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రెగ్యులర్ గా వీరు అంతా కూడా సోషల్ మీడియాలో అక్కడ షూటింగ్ విషయాలను తమ ఎంజాయ్ ను పోస్ట్ చేస్తూ ఉన్నారు. తాజాగా నాగ్ ఇచ్చిన బార్బే క్యూ పార్టీని కూడా యూనిట్ సభ్యులు ఎంజాయ్ చేసినట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో సమంత కూడా నటిస్తోంది. ఇటీవలే పోర్చుగల్ లో షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న సమంత స్పెయిన్ కు స్నేహితులతో కలిసి వెళ్లింది. ఈ పార్టీని సమంత మిస్ అయ్యింది.
Please Read Disclaimer