ఎడిటర్ ఫై మంచు లక్ష్మి ఫైర్..

0ఓ టీవీ ఛానల్ ఎడిటర్ తాజాగా సినిమా ఇండస్ట్రీ నటీమణులపై తీవ్ర స్థాయి లో వ్యాఖ్యలు చేయడం ఫై సినీ పెద్దలు మండి పడుతున్నారు. అసలు ఏం తెలుసనీ ఇలా మాట్లాడతారని , రకరకాల వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా , తాజాగా నిర్మాత , నటి మంచు లక్ష్మి సదరు ఎడిటర్ ఫై మండి పడింది.

”మ‌హిళ‌లంద‌రినీ ఒకేలా చూస్తూ ఆ విధ‌మైన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌దు. విష‌యం ఏమైన‌ప్ప‌టికీ ఈ విధంగా మాట్లాడ‌టం మంచిది కాదు. న‌టీమ‌ణులంద‌రినీ టార్గెట్ చేస్తూ దిగ‌జారుడు వ్యాఖ్యలు చేయ‌డాన్ని సినీ పరిశ్ర‌మ స్వాగ‌తించ‌దు. దీన్ని నేను ఖండిస్తున్నా. అంతేకాకుండా దీన్ని అంత సులువుగా వ‌దిలేయం. సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల‌పై నీచ‌మైన కామెంట్లు చేయ‌డం ద్వారా ప‌బ్లిసిటీ తెచ్చుకునే ప్ర‌య‌త్నం వ‌ద్దు” అంటూ ఆమె తన ట్విట్టర్ ద్వారా ఆవేదనను తెలియజేసింది.