మంచు మనోజ్ ఇంకొ గెస్ట్ రోల్

0ఒక్కడు మిగిలాడు’ ప్లాప్ తర్వాత మనోజ్ మరో సినిమాకి సంతకం చేయలేదు.అయితే గెస్ట్ రోల్స్ మాత్రం చేస్తున్నాడు. తరుణ్ తాజా సినిమా ‘ఇది నా లవ్ స్టోరి’లో మనోజ్ గెస్ట్ రోల్ చేశాడు. సినిమా విడుదల ముందు రోజు వరకూ ఈ సంగతిని తరుణ్ టీమ్ దాచి పెట్టింది. ప్రేక్షకులకు సడన్ స‌ర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నారు. రిలీజ్ రోజే సినిమాకు ఘోరమైన ప్లాప్ టాక్ రావడంతో మంచు మనోజ్ గెస్ట్ రోల్ గాల్లో కలిసింది.

ఇప్పుడుమరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. శ్రీకాంత్ హీరోగా కరణం బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆపరేషన్ 2019’లో అతిథిగా చేస్తున్నాడు మనోజ్. పోసాని దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రాజకీయాల నేపథ్యంకి వచ్చిన ‘ఆపరేషన్ దుర్యోధన’ హిట్ కొట్టింది. దాన్ని గుర్తు పెట్టుకుని రాజకీయల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారు. 2019 ఎన్నికల ముందు సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు మనోజ్.