దీంతో నన్ను చంపేశారు: మంచు మనోజ్‌

0విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన హీరో మంచు మనోజ్‌. ఆయన ఆదివారం పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. వీరందరికీ మనోజ్‌ సోమవారం కృతజ్ఞతలు తెలిపారు.

అయితే కొందరు మనోజ్‌ సినీ కెరీర్‌ను రివ్యూగా చేసి ఓ వీడియోను రూపొందించారు. అందులో ఆయన సినిమా విజయాలతోపాటు వైఫల్యాల్ని కూడా ప్రస్తావించారు. ఇది మనోజ్‌కు చాలా బాగా నచ్చేసింది. దీన్ని చూసిన ఆయన ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు. వీడియోను కూడా పంచుకున్నారు.

ఈ వీడియోను చేసిన వారు ప్రేమతో తనను చంపేశారని మనోజ్‌ అన్నారు. ఇది తన ఉత్తమమైన పుట్టినరోజు కానుకని చెప్పారు. దీన్ని రూపొందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కచ్చితంగా కష్టపడి, మంచి సినిమాలు చేస్తానని మాటిచ్చారు. హృదయపూర్వకంగా మీ అందర్నీ ప్రేమిస్తున్నానని అభిమానులను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.