సాహో లేడీ విలన్ పిచ్చెక్కించే వేషాలు

0

వయసు 50 కి చేరువలో ఉన్నా మనసు 26 దగ్గరే ఆగిపోయింది. దాని ఫలితం.. ఇప్పటికీ ఈ అమ్మడు టీనేజీ గాళ్ లా.. బోల్డ్ & టెంప్టింగ్ బ్యూటీగా కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతూనే ఉంది. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో హొయలు పోతూ మండు వేసవిలోనూ కుంపట్లు రాజేస్తోంది. లేటు వయసు యాంజెలినాకు ఇండియన్ వెర్షన్ లా ఫీలవుతూ అంతకంతకు అగ్ని పరీక్ష పెడుతోంది. అసలింతకీ ఎవరీవిడ? అంటే..

పేరు మందిర భేడీ. బుల్లితెర వీజేగా.. టాప్ మోడల్ గా.. నటిగా.. మల్టీ ట్యాలెంటెడ్ గాళ్ గా అభిమానులకు సుపరిచితం. అంతకుమించి నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో మరింతగా చేరువైంది. ఐపీఎల్ మ్యాచ్ లలో మందిర విన్యాసాల విలాపాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని వ్యాపకాలు ఉన్న ఈ 46 వయసు బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరడం హాట్ టాపిక్ గా మారింది.

డార్లింగ్ ప్రభాస్ కి ధీటుగా పోరాటాలు సాగించే విలన్ గ్యాంగ్ లో మందిర దమ్మెంతో చూపించబోతోందిట. నీల్ నితిన్ ముఖేష్ – జాకీష్రాఫ్ – మహేష్ మంజ్రేకర్ లాంటి బాలీవుడ్ స్టార్లతో కలిసి ఈ అమ్మడు కూడా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మందిర పాత్ర పేరు కల్కి. ఇటీవలే హైదరాబాద్ లో జాకీష్రాఫ్ తో పాటు కాంబినేషన్ సీన్స్ లోనూ మందిర నటించింది. కొన్ని యాక్షన్ సీన్స్ లో మందిర స్టంట్స్ మైండ్ బ్లోవింగ్ అనేలా తెరకెక్కించారని తెలుస్తోంది. అందులో హ్యాండ్ టు హ్యాండ్ యుద్ధ విన్యాసాల్ని అమ్మడు ప్రదర్శించిందిట. మొత్తానికి ప్రభాస్ అభిమానుల గుండెల్లో మంటలు పుట్టించే లేటు వయసు విలన్ గా మందిర ఫీట్స్ ని తెరపై చూడాల్సి ఉంటుందన్నమాట. నేడు మందిర బర్త్ డే సందర్భంగా అభిమానులంతా శుభాకాంక్షలతో ముంచేస్తున్నారంతే. 1995లో దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే చిత్రంతో తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఇప్పటికీ బాలీవుడ్ లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండడం ఆశ్చర్యకరమే సుమీ!!
Please Read Disclaimer