క్రిష్ ‘మణికర్ణిక’ ప్రీ లుక్

0ఆమె అసలు పేరు మణికర్ణిక తాంబే. కాని పెళ్ళయిన తరువాత ఝాన్సీ రాజ్యానికి ఆమెకు రాణి అయ్యింది. తన భర్త చనిపోవడంతో.. బ్రిటీష్ వారి సంరక్షణలో రాజ్యానికి గార్డియన్ అయ్యింది. చివరకు బ్రిటీష్ సేనలపై తిరుగుబాటు చేసింది. విరామం ఎరుగని పోరాటం చేసింది. 29 ఏళ్ళకే యుద్ద భూమిలో ప్రాణాలు అర్పించింది. ఆమె ఎవరో కాదు.. చరిత్రలో ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా పేరు ప్రఖ్యాతులు గాంచింది ఆవిడే.

ఇప్పుడు సరిగ్గా ఇదే కథాంశంతో కంగనా రనౌత్ మెయిన్ లీడ్లో ఝాన్సీ లక్ష్మీ బాయ్ కథ ఒక సినిమాగా తెరకెక్కుతోంది. విశేషం ఏంటంటే.. ఈ సినిమాను మన తెలుగు వాడైన క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ”మణికర్ణిక” అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో టైటిల్ పాత్రను కంగన పోషిస్తుండగా.. నిన్ననే ఈ సినిమా తాలూకు ప్రీ లుక్ ఒకటి రిలీజైంది. అసలు రాణిగా కంగన ఎలా ఉంటుందో ఆమె ముఖం తాలూకు స్కెచ్ తో మనోళ్ళు చూపించేశారు.

విశేషం ఏంటంటే.. ఈ సినిమా కోసం కంగన ఆల్రెడీ ఫారిన్లో గుర్రపు స్వారీతో పాటు కత్తి యుద్దాలు కూడా నేర్చుకుంది. అలాగే పాత కాలంనాటి డబుల్ బారెల్ గన్ ఎలా కాల్చాలో కూడా ఆమె ప్రాక్టీస్ చేసిందట. ఇక క్రిష్ ఈ సినిమా షూటింగ్ మొదలెట్టడమే తరువాయి.rani-mani-karnika