కంగనా-క్రిష్.. డబ్బింగ్ చూడాల్సిందే

0Kangana-and-Krishబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా.. టాలీవుడ్ ఫిలిం మేకర్ క్రిష్ రూపొందిస్తున్న మూవీ మణికర్ణిక. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో చారిత్రక చిత్రాలు తీయడంలో తన పట్టు ఎలాంటిదో చూపించిన క్రిష్.. ఇప్పుడు కంగనా ప్రధాన పాత్రలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ చరిత్రను తెరకెక్కించనున్నాడు.

అయితే.. ఈ సినిమాను క్రిష్ రూపొందిస్తుండడంతో తెలుగులోనూ రూపొందించే అవకాశాలున్నాయని భావించారు. కానీ ఇప్పుడీ విషయంపై క్లారిటీ వచ్చేసింది. కేవలం హిందీలో మాత్రమే రూపొందనున్న మణికర్ణికను.. ఇతర భాషల్లోకి డబ్ చేయనున్నారు. తెలుగులో కూడా డబ్బింగ్ వెర్షన్ మాత్రమే రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కానుండగా.. జూలై నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మధ్య ప్రదేశ్.. రాజస్థాన్ లతో పాటు వారణాసిలోనూ ఈ మూవీ షూటింగ్ చేపట్టనున్నారు.

అలాగే రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ ను నిర్మించి మణికర్ణికను తెరకెక్కించనుండడం విశేషం. ఇప్పటికే సెట్స్ నిర్మాణం కూడా ప్రారంభమైపోగా.. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రానికి కంగనా రనౌత్ కేవలం హీరోయిన్ గా మాత్రమే వర్క్ చేయనుంది. మొదట మణికర్ణికకు కో డైరెక్టర్ గా కూడా కంగనా రనౌత్ ఉంటుందని అంతా భావించారు. 2018 సమ్మర్ నాటికి రిలీజ్ చేసేలా మణికర్ణిక షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు క్రిష్.