అమ్మ ఆత్మకే కునుకు పట్టనీదేమో!

0

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి .. దివంగత కథానాయిక జయలలిత జీవితకథతో ఇప్పటికే వరుసగా బయోపిక్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు- తమిళ్ ద్విభాషా చిత్రాల్ని మేకర్స్ రూపొందిస్తున్నారు. నిత్యామీనన్ టైటిల్ పాత్రలో ఓ సినిమా సెట్స్ పై ఉంది. విద్యాబాలన్ టైటిల్ పాత్రలో నటించే సినిమా గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో జయలలిత జీవితకథను వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్నారు.

అయితే నిత్యా మీనన్ .. విద్యా బాలన్ లాంటి స్టార్లను వరించినట్టే తనను కూడా ఈ బయోపిక్ ఆఫర్ వరించిందని చెబుతోంది మలయాళీ బొద్దుగుమ్మ మాంజిమ మోహన్. గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లో అమ్మ జయలలిత పాత్రకు తొలి ఆప్షన్ గా తననే సంప్రదించారట. ఆ కళ్లు.. ముఖ కవలికలు అచ్చం అమ్మనే పోలి ఉంటాయని మాంజిమ అంది. అయితే తాను అప్పటికే మూడు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల.. మూడు నెలల కాల్షీట్లు ఇవ్వలేని సన్నివేశంలో.. ఆ గ్రేట్ ఆఫర్ ని కాదనుకోవాల్సి వచ్చిందని మాంజిమ కాస్తంత ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు అమ్మ పాత్రకు తాను పక్కాగా సూటబుల్ అని మాంజిమ కాన్ఫిడెంట్ గా చెబుతోంది.

మాంజిమ ప్రస్తుతం `ఒరు వడక్కిన్ సెల్ఫీ` అనే చిత్రంతో మాలీవుడ్కు పరిచయం అయింది. అనంతరం `అచ్చం ఎన్బదు మడమయడా` చిత్రం ద్వారా కోలీవుడ్ లో ప్రవేశించింది. సాహసం శ్వాసగా సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ప్రస్తుతం ఇరుగు పొరుగు పరిశ్రమల్లో ఈ అమ్మడు బిజీ. తాజాగా తమిళంలో గౌతమ్ కు జోడీగా `దేవరాట్టం` అనే చిత్రంలో నటించింది. మే 1వ ఈ చిత్రం విడుదలవుతోంది. ఓ చిట్ చాట్ లో మాట్లాడుతూ అజిత్ .. విజయ్ లాంటి స్టార్లతో నటించాలనుందని చెప్పడమే గాక జయలలిత బయోపిక్ ఆప్షన్ వదులుకోవాల్సింది కాదని చెప్పింది మాంజిమ. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ లో అమ్మ పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అంటే శివగామి రమ్యకృష్ణ నటిస్తున్నారని తెలుస్తోంది. మాంజిమ మరీ ఇంతగా కలత చెందితే అమ్మ ఆత్మ సమాధి నిదుర నుంచి లేచొస్తుందేమో!
Please Read Disclaimer