చందమామకు సవతి పోరు!

0చందమామ కాజల్ ఓ ప్రాజెక్టుకు కమిటైందంటే ఎంతో ఆచితూచి కానీ ఆ నిర్ణయం తీసుకోదు. అయితే ఇటీవలి కాలంలో ఈ భామ టాలీవుడ్ లో స్థాయికి తగ్గ అవకాశాలు అందుకోలేకపోతోంది. కొలీగ్స్ నయనతార – అనుష్క కెరీర్ పరంగా పెద్ద స్పాన్ తో దూసుకుపోతూ అగ్రకథానాయకులకు ఆప్షన్ గా మారితే – తాను మాత్రం యువహీరోల సరసన నటించేందుకే ప్రాధన్యతనిస్తోంది. తమిళంలో అడపాదడపా విజయ్ లాంటి స్టార్ హీరో సరసన సంతకం చేస్తోంది. టాలీవుడ్ లో అయితే నవతరం హీరోలకు – ప్రయోగాత్మక కథలకు ఓకే చెబుతోంది.

ఇదివరకూ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోని `అ!` సినిమాలో నటించింది. అలాంటి ప్రయోగాత్మక స్క్రిప్టులు తన వద్దకు వస్తే ఎన్ని సినిమాలైనా చేస్తానని అంది. దీన్ని బట్టి పెద్ద హీరోల సినిమాల్లో గ్లామర్ రోల్స్ కంటే ఇలాంటి ప్రయోగాలే బెస్ట్ అని కమిటైందని అర్థం చేసుకోవచ్చు. అదంతా అటుంచితే.. కాజల్ రెండోసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించేందుకు సంతకం చేసి ఆశ్చర్యపరిచింది. అయితే ఆన్ లొకేషన్ ఈ యువహీరోతో కలిసిపోయి కాజల్ ఎంతో జోవియల్ గా ఉన్న కికి ఛాలెంజ్ వీడియో అంతే పెద్ద షాక్ నిచ్చింది. గురువు తేజ సిఫారసు మేరకు ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాకి సంతకం చేసిందని భావించాలి.

ఇకపోతే ఇదే చిత్రంలో వేరొక బ్యూటీని ఎంపిక చేసుకున్నాడు తేజ. బాలీవుడ్ నటి – ప్రియాంక చోప్రా సోదరి మన్నారా చోప్రా రెండో నాయికగా నటించనుంది. మన్నారా ఇదివరకూ రోగ్ – జక్కన్న చిత్రాల్లో నటించింది. కాజల్ ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుందో మన్నారా అంత మాసీగా కనిపిస్తుంది. అంటే ఇందులో గ్లామర్ కంటెంట్ని మన్నారా ఫిల్ చేస్తుందని భావించవచ్చు. ఈ చిత్రాన్ని ఏటీవీ అధినేత అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.