మిస్ వరల్డ్ కి ఛాన్సులేవీ?

0

మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ప్రపంచ సుందరిగా అవతరించి ఇప్పటికే చాలా కాలమే అయ్యింది. కానీ ఇప్పటివరకూ బాలీవుడ్ లో ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేకపోయింది. కారణం ఏదైనా.. తాను మాత్రం ఎంతో పట్టుదలగా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. కథానాయిక కావాలన్నది తన జీవితాశయం అని కిరీట ధారణ అనంతరం ప్రకటించిన ఈ అమ్మడు ఆ తర్వాత చేయని ప్రయత్నమే లేదు.

మిస్టర్ పెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని – తన సినిమాలో నటించే అవకాశం వస్తే అస్సలు విడిచిపెట్టనని ప్రకటించింది. ఖాన్ ల త్రయంతో సినిమా ఆఫర్లు వస్తే అస్సలు వదిలిపెట్టనని అంది. అయినా అమీర్ కానీ షారూక్ – సల్మాన్ కానీ ఎవరూ పిలిచి అవకాశం ఇవ్వలేదు. ఐశ్వర్యారాయ్ – సుశ్మితాసేన్ లాంటి సుందరీమణులతో పోలిస్తే మానుషికి మాత్రం ఆ ఒక్క ఛాన్స్ వెంటనే రాలేదు.

కానీ మానుషి మాత్రం ప్రయత్నం వీడలేదు. ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా కొత్త కొత్త ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా రివీల్ చేసిన ఫోటోలో మానుషి అందచందాలు .. వింటేజ్ లుక్ మైమరిపిస్తోంది. కనీసం ఈ ప్రయత్నం చూసైనా దర్శకనిర్మాతలు ఛాన్సులిస్తారేమో చూడాలి.